అక్షరటుడే, హైదరాబాద్: Telangana Rythu DISCOM | తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం కాబోతోంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న Telangana State Northern Power Distribution Company Limited (TGNPDCL), Telangana State Southern Power Distribution Company Limited (TGSPDCL) కు అదనంగా మూడో డిస్కంను సర్కారు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త డిస్కంకు Telangana Rythu Power Distribution Company Limited (TGRPDCL) గా నామకరణం చేశారు. కంపెనీస్ యాక్ట్–2013 ప్రకారం ఈ కొత్త డిస్కంను ఏర్పాటు చేస్తున్నట్లు సర్కారు వెల్లడించింది.
Telangana Rythu DISCOM | రైతులకు పంపిణీ లక్ష్యం
తెలంగాణలో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు కొత్త డిస్కంను ఏర్పాటు చేస్తున్నట్లు సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యవసాయం, మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, నీటి సరఫరా వంటి విభాగాలకు కొత్త డిస్కం విద్యుత్ సరఫరా చేయనుంది.
Telangana Rythu DISCOM | ప్రధాన కార్యకలాపాలు
TGRPDCL ద్వారా చేపట్టబోయే ప్రధాన కార్యకలాపాలు ఇవి:
వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు విద్యుత్ సరఫరా విస్తరణ
కొత్తగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల అందజేత
డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (DTRs), ఎల్టీ లైన్ల విస్తరణ, నిర్వహణ
విద్యుత్ వినియోగం గణాంకాలు, మీటరింగ్ వ్యవస్థ నిర్వహణ
వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన, విశ్వసనీయ విద్యుత్ సరఫరా
సీఎండీగా ముషార్రఫ్ అలీ ఫరూఖీ
కొత్తగా ఏర్పడిన డిస్కంకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషార్రఫ్ అలీ ఫరూఖీ Musharraf Ali Faruqui (IAS)ను నియమించారు. ఆయన నేతృత్వంలో సంస్థ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
బోర్డు ఆఫ్ డైరెక్టర్లు
TGRPDCL ప్రారంభ బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా విద్యుత్ శాఖలోని కొందరు ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరిలో:
- Musharraf Ali Faruqui – CMD
- Vanteru Thirupathi Reddy – డైరెక్టర్
- P Krishna Reddy – డైరెక్టర్
- Vanguru Mohan Rao – డైరెక్టర్
- N Narasimhulu – డైరెక్టర్
రూ.5 కోట్ల షేర్ క్యాపిటల్
ఈ సంస్థకు రూ.5 కోట్ల షేర్ క్యాపిటల్ ను సర్కారు నిర్ణయించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వ తరఫున TGSPDCL – TGNPDCL సమానంగా అందించనున్నాయి.
హైదరాబాద్‌లో రిజిస్టర్డ్ కార్యాలయం
TGRPDCL సంస్థ రిజిస్టర్డ్ కార్యాలయం హైదరాబాద్‌లోని మింట్ కంపౌండ్‌లో ఏర్పాటు చేయనుంది.

