అక్షరటుడే, బాల్కొండ: Telangana School Hostel | తెలంగాణ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్‌ను శనివారం ఎంఈవో బట్టు రాజేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు పాఠశాలలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేర్ టేకర్‌ను తొలగించాలని ఆదేశాలు జారీచేశారు.
Telangana School Hostel | తెలంగాణ మోడల్ స్కూల్లో..
తెలంగాణ మోడల్ స్కూల్ (Telangana Model School) బాలికల హాస్టల్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, సమీకృత బాలుర సంక్షేమ వసతి గృహం, మహాత్మ జ్యోతిబాపూలే (Mahatma Jyotibapule) బాలికల హాస్టల్‌లను ఎంఈవో ఉదయం 6:30 గంటల నుండి 8:00 గంటల వరకు పరిశీలించారు. హాస్టళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Telangana School Hostel | హాస్టల్‌లో అనేక సమస్యలు..
ఈ సందర్భంగా తెలంగాణ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్‌లో మెనూకు సరిపడా సరుకులు అందుబాటులో లేకపోవడం, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించకపోవడాన్ని ఎంఈవో పరిశీలించారు. నీటిసౌకర్యం తక్కువగా ఉండడం వంటి సమస్యలను విద్యార్థినులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కేర్‌టేకర్‌ను వెంటనే తొలగించాలని మండల విద్యాశాఖ అధికారి (Education Officer) ఆదేశించారు.
Telangana School Hostel | కస్తూర్బా గాంధీ పాఠశాల..
అనంతరం కస్తూర్బా గాంధీ (Kasturba Gandhi) బాలికల పాఠశాలను సందర్శించగా, అక్కడ విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారం అందిస్తున్నట్లు ఎంఈవో గమనించారు. అలాగే సమీకృత బాలుర వసతి గృహం, మహాత్మ జ్యోతిబాపూలే బాలికల వసతి గృహాలను కూడా తనిఖీ చేశారు. విద్యార్థులకు పరిశుభ్రత పాటిస్తూ మెనూ ప్రకారం భోజనం అందించాలని, లేనిపక్షంలో బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Indiramma Houses Scheme | పేదోడి సొంతింటి కలను నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి..: మానాల మోహన్‌రెడ్డి

