Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Speaker Decision | స్పీకర్​ కీలక నిర్ణయం.. కడియం, దానం అనర్హత పిటిషన్ల కొట్టివేత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Speaker Decision | స్పీకర్​ కీలక నిర్ణయం.. కడియం, దానం అనర్హత పిటిషన్ల కొట్టివేత

తెలంగాణతాజా వార్తలు

Telangana Speaker Decision | స్పీకర్​ కీలక నిర్ణయం.. కడియం, దానం అనర్హత పిటిషన్ల కొట్టివేత

తెలంగాణ స్పీకర్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 11:28 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Telangana Speaker Decision

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Speaker Decision | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్​ (Speaker Gaddam Prasad Kumar) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు.

Contents
  • Telangana Speaker Decision | ఆధారాలు లేవని..
    • Telangana Speaker Decision | ఎంపీగా పోటీ చేసినా..
      • Telangana Speaker Decision | ప్రజాస్వామ్యంపై దాడి : కేటీఆర్​

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari), దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై ఇటీవల విచారణ ముగిసింది. దీంతో స్పీకర్​ తీర్పును రిజర్వ్​ చేశారు. బుధవారం ఉదయం తీర్పు ప్రకటించారు. వారి అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పిటిషన్లను ఆయన కొట్టివేశారు.

Telangana Speaker Decision | ఆధారాలు లేవని..

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ గూటికి చేరారు. కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, సంజయ్, దానం, కడియం కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్​ఎస్​ స్పీకర్​ను కోరింది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని జూలైలో న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో విచారణ చేపట్టిన స్పీకర్​ గతంలోనే 8 మందికి ఊరట కలిగించారు. వారు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఎమ్మెల్యేల జీతం నుంచి బీఆర్​ఎస్​కు పార్టీ ఫండ్​ వెళ్తుందనే కారణాలతో పిటిషన్లను కొట్టివేశారు.

Telangana Speaker Decision

Telangana Speaker Decision | ఎంపీగా పోటీ చేసినా..

పార్టీ మారిన వారిలో దానం నాగేందర్​ (Danam Nagender) కాంగ్రెస్​ టికెట్​పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. కడియం శ్రీహరి తన కూతురిని కాంగ్రెస్​ ఎంపీగా గెలిపించుకున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకున్నారు. అయినా కూడా స్పీకర్​ వారికి ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం స్పీకర్​ తీర్పు చెప్పారు. అయితే కాంగ్రెస్​ ఎంపీగా పోటీ చేసిన దానం పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్​ పేర్కొనడం గమనార్హం. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Telangana Speaker Decision | ప్రజాస్వామ్యంపై దాడి : కేటీఆర్​

పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. కాంగ్రెస్ బీఫామ్ (Congress B Farm) మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం అని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారన్నారు.

ఇది కూడా చదవండి..: Kukatpally ACB Trap | ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్

Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!
Telangana IPS Cadre | కేంద్ర మంత్రి అమిత్​షాతో సీఎం రేవంత్​ భేటీ.. ఐపీఎస్​లను కేటాయించాలని విన్నపం!
Ranikhet Disease | కొక్కెర వ్యాధితో వేలాది కోళ్ల మృతి
Strengthening Gram Panchayats | గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం : మంత్రి పొంగులేటి
Sircilla Weavers Dues | నేత కార్మికుల విద్యుత్​ బకాయిలు రద్దు చేయాలి : కేటీఆర్​
TAGGED:BRS vs CongressCongress B FarmDanam NagenderKadiyam SrihariMLA disqualification caseMLA Kadiyam SrihariSpeaker Gaddam Prasad KumarTelangana PoliticsTelangana Speaker Decision
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Small Notes ATM Small Notes ATM | ఇక ఏటీఎంల నుంచే చిన్న నోట్లు.. రూ.10, రూ.20, రూ.50 డ్రా చేసే కొత్త వ్యవస్థకు కేంద్రం సిద్ధం
Next Article West Indies Team Travel West Indies Team Travel | యుద్ధం వ‌ల‌న‌ భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్ జట్టుకి గుడ్ న్యూస్.. తొమ్మిది రోజుల తర్వాత స్వదేశానికి ప్రయాణం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?