అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Sports University | ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా తెలంగాణలో అన్ని సౌకర్యాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలిచ్చారు. ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యమిచ్చేలా, ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటడమే లక్ష్యంగా క్రీడా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.
క్రీడలకు అవసరమైన మైదానాలు, యూనివర్సిటీ, శిక్షణ తదితర అంశాలపై క్రీడాశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రంలో తలపెట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (YISU) అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మైదానాలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడంపై చర్చించారు. ఈ సందర్భంగా నిర్మాణాలకు సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు.
Telangana Sports University | క్రీడాకారులకు సౌకర్యాలు
గచ్చిబౌలి (Gachibowli) ఔట్‌డోర్ స్టేడియంను పునరుద్ధరించడంతో పాటు, స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలు, క్రీడాకారులకు శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కిషోర్ పాల్గొన్నారు.

Telangana Sports University | అతిథ్యం ఇచ్చేలా..
ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి ప్రధాన కార్యక్రమాలకు తెలంగాణ (Telangana) ను ఆతిథ్యమిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్ల పనితీరును బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. శిక్షణ, పోటీలకు భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం మరియు సరూర్‌నగర్ స్టేడియంలను ఆధునీకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: Bamrukn Ud Daula Lake | ప్రారంభానికి బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్ధం

