అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Summer Heat | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే భానుడు భగభగ మండుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ (Telangana) గత వానాకాలం సీజన్లో భారీగా వర్షాలు పడ్డాయి. చలికాలంలో సైతం రెండు సార్లు కోల్డ్ వేవ్‌లు వీయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మార్చి 1 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో కాలు బయట పెట్టాలేని పరిస్థితి.
Telangana Summer Heat | రాత్రి చల్లగా..

రానున్న ఆరు రోజులు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో తేమ స్థాయిలు 15 శాతం కంటే తక్కువగా పడిపోతాయి. తీవ్రమైన పొడి గాలుల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు హైదరాబాదులో 37 డిగ్రీల వరకు నమోదు అవుతాయి. తూర్పు తెలంగాణలో 40 డిగ్రీలకు పెరుగుతాయి. రాత్రి మాత్రం కాస్త చల్లగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు మధ్య తెలంగాణలో 17-18 డిగ్రీలు, తూర్పు తెలంగాణలో 19-20 డిగ్రీలకు తగ్గుతాయి. పగటి పూట అతి వేడిగా ఉన్నప్పటికీ, రాత్రి సమయం కొద్దిగా చల్లగా ఉంటుంది.
Telangana Summer Heat | పెరిగిన విద్యుత్ వినియోగం
ఎండలు మండుతుండటంతో ప్రజలు ఏసీలు, కూలర్ల వినియోగం ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర చరిత్రలోనే మంగళవారం అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయింది. 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. అంతరాయం లేకుండా సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Face Recognition Schemes | ఇకపై అన్ని పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే.. రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం

