అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Temple Attacks | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు అత్యంత ఆందోళనకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandar Rao) అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలోని హిందూ దేవాలయాల ధ్వంసం, దాడుల ఘటనలపై శుక్రవారం సీపీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
ఆలయాలపై దాడులకు పాల్పడిన మూకలను తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశాను. దేవాలయాల పవిత్రతను కాపాడటం, భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాల భద్రత విషయంలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదన్నారు.
Telangana Temple Attacks | మహిళల సంక్షేమం కోసం..
బీజేపీ నేత బన్సూరి స్వరాజ్ (Bansuri Swaraj) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో రాంచందర్‌రావు మాట్లాడారు. మోదీ ప్రభుత్వంలో ఆరోగ్య, విద్యా, ఆర్థిక రంగాల్లో తీసుకువచ్చిన సంస్కరణలు ‘నారీ శక్తి’ని ఒక జాతీయ మిషన్‌గా మార్చాయన్నారు. పీఎం ఆవాస్ యోజన (PM Awas Yojana) లో 72 శాతం ఇళ్లు మహిళల పేరిట ఉండటం, ముద్రా రుణా (Mudra Loans)ల్లో 69 శాతం మహిళా పారిశ్రామికవేత్తలకు లభించడం వారి ఆర్థిక భద్రతకు నిదర్శనం అని తెలిపారు.

