అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Textile Hub | ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా, ప్రపంచ వస్త్ర రంగంలోనూ తెలంగాణ అగ్రగామిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రైజింగ్‌లో వ్యాపరవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఆసియా టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగించారు.
Telangana Textile Hub | భారత్‌కు గొప్ప చరిత్ర..
ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్‌కు గొప్ప చరిత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందని వివరించారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. ప్రపంచంలోనే ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్‌గా హైదరాబాద్ (Hyderabad) మారిందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణే మా తొలి ప్రాధాన్యమన్నారు.
Telangana Textile Hub | టెక్స్‌టైల్ మన DNAలోనే ఉంది
తెలంగాణకు వస్త్ర రంగంతో విడదీయలేని అనుబంధం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ‘టెక్స్‌టైల్ అనేది మనకు ఒక పరిశ్రమ మాత్రమే కాదు, అది మన జీవనాధారం.’ అని వ్యాఖ్యానించారు. నిజాం కాలం నుంచి ప్రపంచంలోని వ్యాపారులు వస్త్రాలు, ముత్యాల కోసం హైదరాబాద్‌కు వచ్చేవారన్నారు. పోచంపల్లి ఇక్కత్ (Pochampally Ikat), గద్వాల్ చీరలు (Gadwal Sarees), నారాయణపేట చేనేత (Narayanpet Handlooms), వరంగల్ దుర్రీస్ (Warangal Durries) వంటివి మన సంస్కృతిలో భాగమని ఆయన వివరించారు. టెక్స్‌టైల్ అనేది మన DNAలోనే ఉంది’ అని చెప్పారు.
Telangana Textile Hub | పర్యావరణానికి ప్రాధాన్యం
హైదరాబాద్ ప్రస్తుతం కేవలం టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థల రాకతో హాలీవుడ్ స్థాయికి చేరుతోందని ముఖ్యమంత్రి అన్నారు. సినీ ఇండస్ట్రీ (Film Industry)కి అవసరమైన ఫ్యాషన్ అవసరాలను కూడా తెలంగాణ నుంచే తీర్చేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ ‘గ్రీన్ టెక్స్‌టైల్ హబ్’లను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Warangal ACB Raids | వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
