అక్షరటుడే, హైదరాబాద్: Telangana Weather Alert | తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే కొన్ని గంటల్లో మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
Telangana Weather Alert | తీవ్రమైన ఈదురుగాలులతో
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతంతో పాటు కామారెడ్డి జిల్లా పిట్లం, నిర్మల్ జిల్లా బాసర ప్రాంతాల్లో మరో 3 గంటల్లో తీవ్రమైన ఈదురుగాలులతోపాటు కూడిన ఉరుములు, మెరుపులతో వర్షాలు (Intense Thunderstorms) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Telangana Weather Alert | మోస్తరు వర్షాలు
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో, జార్సంగం, జహీరాబాద్, కోహిర్, మునిపల్లి, నారాయణఖేడ్ ప్రాంతాల్లో వచ్చే 2 గంటల పాటు మోస్తరు వర్షాలు (Moderate Rains) పడనున్నాయి.
హైదరాబాద్‌లో మబ్బులతో కూడిన వాతావరణం కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినప్పటికీ, ఎండ తీవ్రత తగ్గలేదు. మధ్యాహ్నం తర్వాత కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

