అక్షర టుడే, ఇందూరు: Temple Attack Allegation | కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress government) హిందూ ఆలయాలకు రక్షణ లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Temple Attack Allegation | గోపాల్బాగ్లో..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Dhanpal) మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని గోపాల్ బాగ్ ప్రాంతంలో ఉన్న పురాతన శివాలయంపై మూడు రోజుల క్రితం కొందరు దాడి చేశారన్నారు. విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని విమర్శించారు. ఇన్ని జరిగినా సీఎం మంత్రులు ఒక్కసారి కూడా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.
Temple Attack Allegation | సెక్యూలర్ అని చెప్పుకున పార్టీలు..
మాట్లాడితే సెక్యులర్ అని చెప్పే కాంగ్రెస్ హిందువులపై దాడి జరిగితే ఎందుకు ప్రశ్నించడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిజమైన సెక్యులర్ భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) అని తెలిపారు. మోదీ సర్కారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని.. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఒక వర్గానికి మాత్రమే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కేవలం అధికారం కోసం దిగజారి పనిచేస్తున్నారని విమర్శించారు.
Temple Attack Allegation | కఠినంగా శిక్షించాలి..
శివాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ధన్పాల్ డిమాండ్ చేశారు. దాడిచేసిన వారిని అరెస్ట్ చేసిన ఇప్పటివరకు రిమాండ్ చేయకపోవడం తగదన్నారు. పోలీస్ కమిషనర్ (Police Commissioner) స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గోశాల సమీపంలో స్థలం కబ్జాకు గురవుతుందని, ఇటీవల ప్రార్థన మందిరాన్ని కూడా నిర్మించారని చెప్పారు. వీటిపై కలెక్టర్‌తో పాటు సీపీ దృష్టిసారించి తొలగించాలని డిమాండ్ చేశారు. హిందువుల సహనాన్ని ఓపికను చూస్తున్నారని, ఒకసారి కాషాయం ఓపిక నశిస్తే ఎవరు తట్టుకోలేరన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ఇప్పకాయల కిషోర్ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Property Tax Collections | ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలి

