అక్షరటుడే, ఎల్లారెడ్డి: Temple Development Funds | తాడ్వాయి మండలం సంతాయిపేటలోని భీమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి (bheemeshwara temple) ఎల్లవేళలా కృషి చేస్తామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (mla madan mohan rao) గతంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆలయానికి రూ.1.80 కోట్లు మంజూరు చేయించారు.
Temple Development Funds | శివరాత్రి రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి..
ఇటీవల శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. సోమవారం ఆలయానికి భారీ ఎత్తున నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని (yellareddy news) తాడ్వాయి మండలం సంతాయిపేట్ గ్రామంలోని భీమేశ్వర స్వామి ఆలయం ప్రాంతీయంగా విశేష ప్రాముఖ్యత కలిగిన దేవాలయంగా నిలిచింది. రాష్ట్రం నలుమూలల నుంచి, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధి నుండి అనేక మంది శివభక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు.
Temple Development Funds | నిధుల విడుదలలో కీలకపాత్ర..
ఈ నిధుల సాధనలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కీలక పాత్ర పోషించారు. ఆలయ ప్రాముఖ్యత, చారిత్రక నేపథ్యాన్ని అసెంబ్లీ సమావేశాల్లో పలుమార్లు ప్రస్తావిస్తూ, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా, వ్యక్తిగతంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును, టీజీటీడీసీ ఎండీ క్రాంతిని కలిసి ఆలయ అభివృద్ధి అవసరాన్ని వివరించి నిధుల మంజూరుకు కృషి చేశారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ ఆలయ అభివృద్ధి అంశాన్ని గత పాలకులు పట్టించుకోకపోయినా, ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక శ్రద్ధతో నిధులు విడుదల చేయించారు.
