అక్షరటుడే, కామారెడ్డి: Temple Theft Arrest | వరుసగా ఆలయాల్లో చోరీలకు పాలడుతున్న అంతర్ జిల్లా దొంగలను ( inter district thieves) పోలీసులు అరెస్టు(police arrest) చేశారు. ఈ మేరకు భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి మీడియాతో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడారు.
Temple Theft Arrest | భిక్కనూరు ఆలయంలో..
భిక్కనూరు ఆలయంలో ఈ నెల 22 న జరిగిన చోరీపై పూజారి ఇచ్చిన ఫిర్యాదుతో(theft news) పోలీసులు కేసు నమోదు చేసి రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు.
భిక్కనూరు టోల్ గేట్ (kamareddy crime) వద్ద మంగళవారం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
పోలీసుల విచారణలో భిక్కనూరు(Bhikkanoor) మండలం ఇసన్నపల్లి ఆలయ తాళం పగులగొట్టి హుండీలో నగదు, దేవత ఆభరణాలు, పెద్దమ్మ ఆలయంలో విగ్రహం, హుండీలో నగదు, సీసీ కెమెరాలు, కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి, రైల్వే స్టేషన్ సమీపంలో రెండు బైకులు, చిన్నమల్లారెడ్డి గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో చిల్లర నగదు, దేవత కళ్ళు చోరీకి పాల్పడ్డట్లు ఒప్పుకొన్నారు.
Temple Theft Arrest | పోలీసులకు చిక్కిన వారిలో..
పోలీసులకు చిక్కిన వారిలో భిక్కనూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన మట్టె అచ్యుత్, కొక్కు గణేష్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నంబర్ ప్లేట్ లేని రెండు బైకులు, రోల్డ్ గోల్డ్ చైన్, పెద్దిరాజు ఇత్తడి విగ్రహం, రెండు సీసీ కెమెరాలు, 5 జతల దేవత కళ్లు, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం (law enforcement) జరిగిందని ఏఎస్పీ తెలిపారు.
ఇందులో (crime india) అచ్యుత్ అనే యువకుడు గతంలో బైక్‌లు దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని, 2025లో భిక్కనూరు, కామారెడ్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు కేసుల్లో ప్రమేయం ఉందన్నారు.
నల్గొండ జిల్లాలో పలు దొంగతనాలు కేసులో పలుమార్లు గణేష్ జైలుకు వెళ్లి వచ్చాడని, నకిరేకల్, వేములపల్లి, భోనగిరి, నల్గొండ, సిద్దిపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో 13 కేసులు ఉన్నాయని ఏఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: EV Discount Employees | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా డిస్కౌంట్

