అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tesla safety system | ఆటోమేటిక్ డ్రైవింగ్ సాంకేతికతలో Tesla మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. భద్రత విషయంలో టెస్లా కార్లు ఏ విధంగా ముందంజలో ఉన్నాయో చూపించే ఘటన తాజాగా వెలుగు చూసింది.
Tesla safety system | ముందుగానే అంచనా..
పొగమంచు, దుమ్ము కారణంగా పూర్తిగా కనిపించని జీరో విజిబిలిటీ పరిస్థితుల్లో ఉన్న రహదారిపై ముందున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించింది.
Tesla safety system | వెంటనే దారి మళ్లించుకుని
కారులో ఉన్న ‘ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్’ వెంటనే స్పందించింది. క్షణాల్లో బ్రేక్ వేసి ప్రమాదాన్ని నివారించింది. వాహనం అతి సమీపంలో ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తర్వాత పరిస్థితిని అంచనా వేసి, సురక్షితంగా దారి మళ్లించుకుని ముందుకు వెళ్లిపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు టెస్లా సాంకేతికతను ప్రశంసిస్తున్నారు. ఇంత వేగంగా, సమర్థంగా స్పందించడం మనుషులకు సైతం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Baby Girl Birth Luck | ఆడపిల్ల పుడితే అదృష్టం కలిసి వస్తుందా.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!
