అక్షరటుడే, హైదరాబాద్ : Millets | ప్రస్తుత కాలంలో చిరుధాన్యాలు (మిల్లెట్స్) చాలా ప్రాధాన్యత పొందాయి. ఆరోగ్యకరమైన ఆహారం (హెల్దీ డైట్) తీసుకునేవారు వీటిని తమ మెనూలో తప్పక చేర్చుకుంటున్నారు. కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, సామలు, అరికెలు వంటి ఈ ధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటివి రాకుండా ఉంటాయి. అయితే, ఇవి ఎంత ఆరోగ్యకరమైనవైనా… కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Millets | చిరుధాన్యాలు ఎవరు తినకూడదు?
ఖనిజాల లోపాలు (Mineral Deficiencies) ఉన్నవారు:
చిరుధాన్యాలలో ‘ఫైటిక్ యాసిడ్’ (Phytic Acid) అనే పదార్థం ఉంటుంది.పోషకాహార నిపుణుల ప్రకారం, వీటిని అధికంగా తినడం వల్ల ఈ ఫైటిక్ యాసిడ్ శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలను బంధిస్తుంది.దీంతో శరీరం ఈ ముఖ్యమైన ఖనిజాలను సరిగ్గా గ్రహించకుండా అడ్డుకుంటుంది. అందుకే వీటిని మరీ ఎక్కువగా తీసుకుంటే ఖనిజాల లోపాలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు:
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చిరుధాన్యాలు తినకపోవడమే మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే, చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.వీటిని ఎక్కువగా తింటే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడవచ్చు.అయితే, కొన్ని అధ్యయనాలు మిల్లెట్స్ తీసుకుంటే థైరాయిడ్ (Thyroid) స్థాయిలు తగ్గుతాయని కూడా తెలిపాయి. కాబట్టి, థైరాయిడ్ ఉన్నవారు మిల్లెట్స్ తినే ముందు తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
పోషకాహార లోపం (Malnutrition) ఉన్నవారు:
పోషకాహార లోపం (Malnutrition) ఉన్నవారు కూడా మిల్లెట్స్ తీసుకోకుండా ఉంటే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఎందుకంటే ఇందులో ఉండే కొన్ని రకాల టానిన్లు అనే పదార్థాలు శరీరానికి అందాల్సిన పోషకాలను శోషించకుండా (గ్రహించకుండా) అడ్డుకుంటాయి.
వీరు మిల్లెట్స్ (Millets ) తినాలని అనుకుంటే, ముందుగా వైద్యులను సంప్రదించాలి. అలాగే, వీటిని ఉపయోగించే ముందు ఐదు లేదా ఆరు గంటలు నానబెట్టి తీసుకోవడం మంచిది.


