Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tiger Movement Kamareddy | ఎల్లంపేట శివారులో పెద్దపులి సంచారం.. పాదముద్రలు సేకరించిన అటవీశాఖ అధికారులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Tiger Movement Kamareddy | ఎల్లంపేట శివారులో పెద్దపులి సంచారం.. పాదముద్రలు సేకరించిన అటవీశాఖ అధికారులు

నిజామాబాద్

Tiger Movement Kamareddy | ఎల్లంపేట శివారులో పెద్దపులి సంచారం.. పాదముద్రలు సేకరించిన అటవీశాఖ అధికారులు

కామారెడ్డి జిల్లాలో పెద్దపులి మరోసారి సంచరించడం కలకలం రేపుతోంది. మాచారెడ్డి రేంజ్ పరిధిలోని ఎల్లంపేట బీట్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 12, 2026 6:44 సా.
Shashi kiran Mottala
21 గంటలు ago
Share
Tiger Movement Kamareddy |
Tiger Movement Kamareddy | ఎల్లంపేట శివారులో పెద్దపులి సంచారం.. పాదముద్రలు సేకరించిన అటవీశాఖ అధికారులు

అక్షరటుడే, కామారెడ్డి: Tiger Movement Kamareddy | కామారెడ్డి జిల్లాలో పెద్దపులి మరోసారి సంచరించడం కలకలం రేపుతోంది. మాచారెడ్డి (Machareddy) రేంజ్ పరిధిలోని రెడ్డిపేట స్కూల్ తండా శివారులోని అటవీ ప్రాంతంలో గత ఆరు నెలల క్రితం పెద్దపులి సంచరించింది. ఆ తర్వాత అటవీ ప్రాంతం గుండా నిజామాబాద్ వైపు వెళ్లి ఉంటుందని (Forest Department Kamareddy) అధికారులు అనుమానించారు.

Contents
  • Tiger Movement Kamareddy | దోమకొండ మండలంలో..
    • Tiger Movement Kamareddy | ఆర్నెళ్ల క్రితం గోదావరి దాటి..

Tiger Movement Kamareddy | దోమకొండ మండలంలో..

గత రెండు నెలలక్రితం దోమకొండ (Domakonda) మండలంలో మరోసారి పెద్దపులి సంచరించినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మరోసారి మాచారెడ్డి రేంజ్ పరిధిలోని ఎల్లంపేట బీట్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దాంతో అటవీ ప్రాంతంలో అధికారులు పులి జాడ కోసం ట్రాక్​ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే పులి పాదముద్రలు సైతం ఫారెస్ట్ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ట్రాక్​ కెమెరాల్లో సైతం పెద్దపులి సంచరిస్తున్నట్లుగా రికార్డయినట్లు సమాచారం. పెద్దపులి సంచారంతో అటవీ ప్రాంత సమీప గ్రామస్థులను ఫారెస్ట్ అధికారులు అలర్ట్ చేశారు. పులి సంచారంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Tiger Movement Kamareddy | ఆర్నెళ్ల క్రితం గోదావరి దాటి..

గత ఆర్నెళ్లక్రితం గోదావరి నది దాటి జగిత్యాల జిల్లా మీదుగా నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోకి ప్రవేశించి అక్కడి నుంచి కామారెడ్డి జిల్లాలోకి పులి ప్రవేశించినట్లుగా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల (Sirisilla) జిల్లా మీదుగా సిద్దిపేట (Siddipet) వైపు వెళ్లి తిరిగి కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని మాచారెడ్డి రేంజ్ పరిధిలోకి పెద్దపులి ప్రవేశించడంతో మాచారెడ్డి రేంజ్ అటవీ ప్రాంతం పెద్దపులికి అనువుగా ఉన్నట్లుగా ఫారెస్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సంతానోత్పత్తి కోసం పులి వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఈ ప్రాంతాన్ని సేఫ్ జోన్​గా పులి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అటవీశాఖ అధికారులు పెద్దపులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేసవి కాలం కావడంతో అటవీప్రాంతంలో నీరు లేక పెద్దపులి నీటి కోసం బయటకు రావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లకూడదని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: CBG Project | తెలంగాణ బయో – ఇంధన రంగంలో నవశకం.. సిద్దిపేటలో రూ. 700 కోట్లతో భారీ CBG ప్రాజెక్టు ప్రారంభం

Dhaba Sitting Case | దాబాలో సిట్టింగ్.. యజమానిపై కేసు నమోదు
ASHA Workers Strike | ఆశావర్కర్ల సమ్మెకు బీఆర్​ఎస్​ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే బిగాల
BLO Absence Issue | బీఎల్​వోల గైర్హాజరుపై కలెక్టర్​ ఆగ్రహం
Anti-Drug Awareness | మత్తుపదార్థాలతో జీవితాలు చిన్నాభిన్నం..
Digital Census India | జనగణన విధులను పక్కగా నిర్వహించాలి
TAGGED:animal movement newsbig cat sightingsdomakondaforest department alertForest Department Kamareddykamareddy forest newsMachareddyNizamabadRural Safety AlertSirisillatelangana wildlifetiger movement indiawildlife tracking
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Electric Pole Removal | ప్రమాదకర విద్యుత్ స్తంభాల తొలగింపు.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన.. Electric Pole Removal | ప్రమాదకర విద్యుత్ స్తంభాల తొలగింపు.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన..
Next Article Kakatiya Nizamabad Kakatiya Nizamabad | ఇంటర్​ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం.. స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు కైవసం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?