అక్షరటుడే, తిరుమల: Tirumala Darshan Rules | తిరుమల TIRUMALA శ్రీవారి భక్తలను అలెర్ట్ చేసే అంశం ఇది. టీటీడీ TTD తాజాగా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. స్లాటెడ్ సర్వ దర్శనంతోపాటు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల భక్తులు ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి కుదరదు. నిర్దేశిత సమయంలోనే దర్శనానికి వారిని అనుమతించాలని తాజాగా టీటీడీ నిర్ణయించింది.
Tirumala Darshan Rules | స్లాట్ ప్రకారం
సదరు టికెట్లు ఉన్న భక్తులు.. తమకు కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే దర్శనానికి వెళ్లాలని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నిబంధనను నిన్నటి (సోమవారం, మార్చి 09) నుంచే అమలు చేస్తోంది.
తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా భక్తులు వచ్చి ఇబ్బంది పడొద్దని, సమయం పాటించే భక్తులకు కూడా ఇబ్బంది కలిగించొద్దని టీటీడీ కోరింది. శ్రీవారి భక్తులందరికీ మంచి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.

