అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tirumala Devotee Rush | తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ (Krishna Teja Guest House) వరకు క్యూలో భక్తులు వేచి ఉన్నారు. వేంకటేశ్వర స్వామి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
Tirumala Devotee Rush | శీఘ్ర దర్శనానికి 4 గంటల సమయం..
తిరుమలలో శీఘ్ర దర్శనాకికి సైతం ఎక్కువ సమయం అవుతోంది. రూ. 300 దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. ఇక సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల్లో స్వామి వారి దర్శనం అవుతోంది. అలాగే స్వామివారిని 67,952 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 27,414 మంది తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు వచ్చింది.

Tirumala Devotee Rush | నవనీత సేవ, పరకామణి..
ఏప్రిల్ నెలకు సంబంధించి జనరల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతి, నవనీత సేవ, పరకామణి సేవ ఆన్‌లైన్ కోటా నేడు ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. అలాగే జనరల్ సేవకులు తిరుపతి, తిరుమల రెండింటి కోసం సేవా బుకింగ్ తేదీ రోజున రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక పరకామణి సేవకులు తిరుమలలో వారి సేవా బుకింగ్ తేదీకి ఒక రోజు ముందుగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..: Arudra Nakshatra Significance | ఆ‘రుద్ర’ నక్షత్రాన.. శివాభిషేకంతో విశేష ఫలాలు

