అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala June Quota | కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర (Tirumala Venkateswara) స్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక న్యూస్ చెప్పింది. జూన్ నెలకు సంబంధించిన దర్శన కోటా షెడ్యూల్ విడుదల చేసింది.
జూన్ నెల శ్రీవారి ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు (Electronic DIP Registrations) ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 21న ఆన్లైన్లో పెట్టనున్నారు. వర్చువల్ సేవలు, అనుబంధ దర్శనం టికెట్లను 21న మధ్యాహ్నం 3 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు.

Tirumala June Quota | శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు..
తిరుమల అంగప్రదక్షిణ టోకెన్లను 23న ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో పెడతారు. శ్రీవాణి ట్రస్ట్ దాతలు దర్శనం & వసతి కోటా (రూ. 10,000) 23న ఉదయం 11 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు, శారీరక వికలాంగుల కోటా 23న మధ్యాహ్నం 3 గంటల నుంచి బుకింగ్ కోసం ఆన్లైన్లో ఉంటాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టిక్కెట్లు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారులు (TTD Officers) విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతి వసతి గదుల కోటా 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
Tirumala June Quota | ఏప్రిల్ నెలకు..
ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.200/-) టిక్కెట్లను ఈ నెల 24న విడుదల చేస్తారు. అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ శాలలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టిక్కెట్లు 25న ఉదయం 10 గంటలకు, మే నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటా 27న ఉదయం 11 గంటలకు విడుదల చేసే అవకాసం ఉంది.
ఇది కూడా చదవండి..: Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం

