Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tirumala Laddu Controversy | కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు..: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Tirumala Laddu Controversy | కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు..: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

Tirumala Laddu Controversy | కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు..: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

గత వైఎస్సార్​సీ ప్రభుత్వ హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికారులు, నిపుణులందరూ కలిసి కుట్రలు చేశారని ఆక్షేపించారు.

admin
Last updated: ఫిబ్రవరి 25, 2026 3:36 సా.
admin
1 నెల ago
Share
Tirumala Laddu Controversy

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala Laddu Controversy | ఆంధ్రప్రదేశ్​లో గత వైఎస్సార్​సీపీ ప్రభుత్వ హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికారులు, నిపుణులందరూ కలిసి కుట్రలు చేశారని ఆక్షేపించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఆయన శాసన సభలో నిర్వహించిన చర్చలో మాట్లాడారు. వైసీపీ హయాంలో లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

Contents
  • Tirumala Laddu Controversy | సిట్​ ఏర్పాటు చేయాలని సూచించిన సుప్రీం
    • Tirumala Laddu Controversy |ఈవో, ఛైర్మన్‌కు తెలియకుండా జరిగాయా..!

Tirumala Laddu Controversy | సిట్​ ఏర్పాటు చేయాలని సూచించిన సుప్రీం

లడ్డూ వ్యవహారంలో సీబీఐ ఆధ్వర్యంలో విచారణకు సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించిందని సీఎం పేర్కొన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ రిపోర్టు పంపించిందన్నారు. అందుకే ఏకసభ్య కమిటీ వేయాలని నిర్ణయించామని తెలిపారు. లడ్డూ వ్యవహారంలోనే కాదు.. చాలా విషయాల్లో తప్పులు చేశారన్నారు. 2019-24 మధ్య 59.71లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించారని చెప్పారు. రూ.231.51 కోట్ల అక్రమాలు జరిగాయని.. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను నీరుగార్చారని చెప్పారు. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయినా కూడా రిపోర్టును తొక్కిపెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు.

Tirumala Laddu Controversy |ఈవో, ఛైర్మన్‌కు తెలియకుండా జరిగాయా..!

రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను తొలగించాలని చంద్రబాబు పేర్కొన్నారు. నెయ్యి తయారీకి కావాల్సిన అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించారని చెప్పారు. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీ ఎనిమిది టన్నులకు తగ్గించారని ముఖ్యమంత్రి తెలిపారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్‌ విజిట్లకు పూర్తిగా మినహాయింపు ఇచ్చారని వెల్లడించారు. ఇన్ని జరిగితే తితిదే బోర్డు ఈవో, ఛైర్మన్‌కు తెలియకుండా జరుగుతాయా అని చంద్రబాబు అన్నారు. ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా నాణ్యత తగ్గిందని చెప్పారు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇది కూడా చదవండి..: Inter Exams | రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..

MLA Disqualification Petitions | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్​ విచారణ
Gold Price Fall | దిగివస్తున్న బంగారం ధర.. ఆల్ టైం హైనుంచి సగం తగ్గిన వెండి
Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
Parabhava Year Horoscope | పంచాంగ శ్రవణం ఆలకిద్దామా.. శ్రీ పరాభవ నామ సంవత్సర అదృష్ట రాశులు ఇవే!
Telangana Congress Women President | తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
TAGGED:Andhra Pradesh AssemblyCBI InvestigationFood Safety ViolationsGhee Adulteration CaseN Chandrababu NaiduSIT ProbeSupreme Court of IndiaTirumala LadduTirumala Tirupati DevasthanamsYSRCP Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article Inter Exams Inter Exams | రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..
Next Article Illegal Brick Kilns Illegal Brick Kilns | నిబంధనలకు పాతర.. జోరుగా అక్రమ ఇటుక బట్టీలు..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?