అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tirumala Vasanthotsavam | తిరుమల (Tirumala)లో ఈ నెల 30 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 1 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.
తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వసంతోత్సవాలకు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న ఉదయం 6:30కు శ్రీదేవి భూదేవి సమేతంగా నాలుగు మాడవీధుల్లో మలయప్ప స్వామివారి ఊరేగింపు నిర్వహించనున్నారు. రెండో రోజు 31న ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మలయప్పస్వామి రథాన్ని ఊరేగించనున్నారు.
Tirumala Vasanthotsavam | పలు సేవలు రద్దు
చివరిరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామితోపాటు సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత ఉత్సవాలు నిర్వహిస్తారు. రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి దర్శనమివ్వనున్నారు. వసంతోత్సవాల నేపథ్యంలో ప్రతి రోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీవరకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్, సహస్రదీపాలంకార సేవ, మార్చి 31న అష్టదళపాద పద్మారాధన సేవను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Loan Apps | లోన్ యాప్స్‌కు మరో యువకుడు బలి

