అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala VIP Break Darshan | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు (Tirumala VIP Break Darshan) రద్దు చేశారు. ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని.. మార్చి 17న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.
Tirumala VIP Break Darshan | ఆనవాయితీగా..
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు (Tirumala VIP Break Darshan), అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16వ తేది ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ తెలిపింది.
మార్చి 19న ఉగాది సందర్భంగా..
అదేవిధంగా మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా మార్చి 18వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని పేర్కొంది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం విశేషాలు..
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం విశేషమైంది. ‘కోయిల్’ అంటే ఆలయం, ‘ఆళ్వార్’ అంటే పవిత్రమైనది. ‘తిరుమంజనం’ అనగా శుద్ధి/స్నానం అని అర్థం. ఆలయాన్ని శుద్ధి చేసే పవిత్రమైన కార్యక్రమం. ఉగాది, అణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు.
ఇది కూడా చదవండి..: Mercedes V-Class India | మెర్సిడెస్ వి-క్లాస్ కారు రీఎంట్రీ.. పరిచయ ధర రూ. 1.4 కోట్లు

