అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TNGOs Leaders Felicitation | టీఎన్జీవోస్ (TNGO) సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా హుస్సేని (ముజీబ్) మరోమారు ఏకగ్రీవంగా (tngos elections) ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి బీటీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ ఆవరణలో ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల అధికారి సుగుణాకర్ రెడ్డి, సహాయ ఎన్నికల అధికారి సురేష్ ముందుగా ఎన్నికల (telangana employees union) నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పోస్టులతో పాటు మొత్తం 19 పోస్టులకు సింగిల్ సెట్ నామినేషన్లు దాఖలయ్యాయి.
TNGOs Leaders Felicitation | ఏకగ్రీవంగా ఎన్నిక..
టీఎన్జీవోస్ ఎన్నికల్లో సింగిల్ సెట్ నామినేషన్లు దాఖలు కావడంతో వారందరూ ఏకగ్రీవంగా(unanimous election tngos) ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. తమపై నమ్మకముంచి, మరోమారు రాష్ట్ర కమిటీకి నాయకత్వం వహించే అవకాశం కల్పించిన అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకముందు కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా పని చేస్తామన్నారు.
TNGOs Leaders Felicitation | నిజామాబాద్ టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో..
రెండోసారి ఎన్నికైన టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను టీఎన్జీవోస్ (employee union leadership) నిజామాబాద్ జిల్లా పక్షాన(Nizamabad) మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా(felicitation ceremony india) సన్మానించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్(government employees association), టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవోస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారాం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మచ్చకూరి సతీష్ కుమార్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Sanatana Dharma | సనాతన ధర్మరక్షణకు అందరూ ఏకం కావాలి: పిట్ల కృష్ణ మహరాజ్
