అక్షరటుడే, వెబ్‌డెస్క్: Toll Plaza New Rules | జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కీలకమైన మార్పు రానుంది. టోల్ ప్లాజాల వద్ద కొత్త నిబంధన అమలు కానుంది. ఇక నుంచి నగదు రూపంలో టోల్ రుసుము వసూలును నిలిపివేయనుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుందని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.
Toll Plaza New Rules | ఇకపై డిజిటల్ చెల్లింపు మాత్రమే..
టోల్ రుసుములను ఇక నుంచి ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. నగదు చెల్లింపులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు తొలగించనున్నట్లు NHAI తెలిపింది. ఈ కొత్త నిబంధన దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై అమలు కానుంది.
ఈ నిర్ణయం ఎందుకంటే..!
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జాం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజా నిర్ణయం వాహనదారులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ అనుభవం కలుగుతుంది.
ఇది కూడా చదవండి..: Lava Bold N2 Pro | ఐఫోన్‌ను తలపించేలా.. బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్
