అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Traffic Problems | నగరాలు, పట్టణాలలో జనాభాతోపాటే ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఉద్యోగుల జీవితంలో విలువైన కాలం ట్రాఫిక్‌లో గడిచిపోతోంది. దీంతో సమయం వృ థా అవడమే కాకుండా ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు.
అలసిపోవడంతో ఉత్పాదకత తగ్గుతోంది. ఆరోగ్య సమస్యలూ (Health Problems) పెరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. సరైన ప్రణాళిక లేకుండా ఫ్లైఓవర్లు, మాల్స్ నిర్మాణం జరగడం వల్ల ట్రాఫిక్ కష్టాలు పెరిగాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Traffic Problems | హైదరాబాద్‌లో గంట..
హైదరాబాద్ (Hyderabad)లో పనిచేసేవారి రోజువారీ కమ్యూట్ సమయం సగటున (పికప్, డ్రాప్ సమయం) 59.5 నిమిషాలుగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఇది బెంగళూరు, ఢిల్లీ -ఎన్‌సీఆర్‌లతో పోలిస్తే కొంచెం తక్కువ అయినప్పటికీ దాదాపు గంట సమయం ట్రాఫిక్‌లో వృథా అవుతోంది. రౌట్‌మ్యాటిక్ మరియు రీసెర్చఎనఎక్స్ సంయుక్తంగా విడుదల చేసిన నావిగేటింగ్ కార్పొరేట్ కమ్యూట్ ఫర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇన్ ఇండియా నివేదికలో ఈ వివరాలున్నాయి. అయితే ఆ నివేదిక వెల్లడించిన దానికన్నా ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఆఫీస్‌కు వెళ్లిరావడానికి రెండు గంటలకుపైగా సమయం పడుతోందని పలువురు చెబుతున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో కార్పొరేట్ టాక్సీ కమ్యూట్ (పికప్, డ్రాప్) వివరాలిలా ఉన్నాయి.
బెంగళూరు : 67.5 నిమిషాలు (3,94,943 ట్రిప్స్).
ఢిల్లీ -ఎన్‌సీఆర్ : 67.5 నిమిషాలు (3,01,488 ట్రిప్స్).
ముంబై : 62.5 నిమిషాలు (22,727 ట్రిప్స్).
చెన్నై : 61 నిమిషాలు (1,66,445 ట్రిప్స్).
హైదరాబాద్ : 59.5 నిమిషాలు (2,09,999 ట్రిప్స్).
పుణె : 59 నిమిషాలు (2,49,068 ట్రిప్స్).
ఇది కూడా చదవండి : Hydraa land seizure | హైడ్రా భారీ ఆపరేషన్.. 47 వేల గజాల భూమి స్వాధీనం

