అక్షరటుడే, ఇందూరు: TRESA Insurance Support | మరణించిన రెవెన్యూ ఉద్యోగి కుటుంబానికి నిజామాబాద్ జిల్లా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నిలిచింది. ఇటీవల మరణించిన సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ కుటుంబానికి ₹75 లక్షల చెక్కు అందజేసింది.
TRESA Insurance Support : విద్యార్థికి ఆర్థిక సాయం
ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా గతంలో ట్రెసా ఆధ్వర్యంలో జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులకు అసోసియేషన్ ప్రతినిధులు ఇన్సూరెన్స్ చేయించారు. ఈమేరకు మరణించిన ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచారు. దీనికితోడు ట్రెసా అనుబంధంగా నిజామాబాద్ రెవెన్యూ ఉద్యోగుల సేవా సంస్థ “హెల్పింగ్ హార్ట్స్” ఆధ్వర్యంలో BDS విద్యార్థి ఓంకార్ కు ₹25,000/- ల ఆర్థిక సహాయం చేశారు.
కార్యక్రమంలో భాగంగా జిల్లా రెవెన్యూ డైరీని అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రెసా జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రెవెన్యూ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నట్లు తెలిపారు. తద్వారా అత్యవసర సమయాల్లో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఒక ఉద్యోగి మరణించిన సందర్భంలో బాధిత కుటుంబానికి రూ. కోటి అందించామన్నారు.
TRESA Insurance Support | రెవెన్యూశాఖ కీలకం..
ముఖ్య అతిథులు PCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ గుండె లాంటిదని, ప్రభుత్వ విజయాలకు రెవెన్యూ శాఖ కీలకం అని తెలిపారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న నిజామాబాద్ ట్రెసా కార్యవర్గాన్ని అభినందించారు.
ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ health insurance విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి cash less health cards ఇవ్వడానికి ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ట్రెసా సభ్యత్వం ఉన్న ఈ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులకు సేవలందేలా ట్రెసా కృషి చేస్తుందని ప్రకటించారు.
కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర నాయకులు రాజ్‌కుమార్, రామకృష్ణారెడ్డి, నిజామాబాద్ రూరల్ MLA భూపతి రెడ్డి, మేయర్ ఉమారాణి, నుడా ఛైర్మన్ కేశ వేణు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, RDO రాజేంద్ర కుమార్, ట్రెసా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

