అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Final Warning | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హర్ముజ్ జలసంధిని మంగళవారం రాత్రి లోగా తెరవకపోతే ఇరాన్ (Iran)పై పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ట్రంప్ గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ దేశంలోని పవర్ ప్లాంట్లు, వంతెనలు సహా మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తామన్నారు. అయితే అమెరికా వార్నింగ్‌ను ఇరాన్ పట్టించుకోవడం లేదు. తమ దేశంలో 1.4 కోట్ల మంది ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు.
Trump Final Warning | అద్భుతం జరగొచ్చు
ఇరాన్ నేటి రాత్రి అంతం అవుతుందని ట్రంప్ అన్నారు. అది జరగొద్దనే తాను అనుకుంటున్నాని, కానీ జరగొచ్చని చెప్పారు. ఆ నాగరికతను వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదన్నారు. ఇరాన్‌లో ఇప్పుడు పాలన మారింది కాబట్టి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం కానుందని పేర్కొన్నారు. 47 ఏళ్ల నియంతృత్వం అంతరిస్తుందన్నారు. ఇరాన్ ప్రజలను దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. దీంతో ఏం జరుగుతుందోనని ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
వాషింగ్టన్ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకు) వరకు లొంగిపోవడానికి టెహ్రాన్‌కు సమయం ఉందని ట్రంప్ అన్నారు. ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం కొత్త శిఖరానికి చేరడంతో ఇరాన్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
దీనిని కూడా చదవండి : Mojtaba Khamenei Coma | కోమాలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ?
