అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Iran tensions | ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. భయపడి ట్రంప్ వెనక్కి తగ్గారని సెటైర్ వేసింది.
హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ట్రంప్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయలపై దాడులు చేస్తామన్నారు. దీనికి ఇరాన్ సైతం దీటుగా స్పందించింది. తమ మౌలిక వసతులపై దాడులు చేస్తే తీవ్ర పరిణామలు ఉంటాయని హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని తెలిపింది. ఈ క్రమంలో ట్రంప్ దాడులు 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Trump Iran tensions | ఎలాంటి చర్చలు జరగలేదు
ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందించింది. విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలతో ఆయన వెనక్కి తగ్గారని పేర్కొంది. అఫ్గానిస్థాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం సైతం ఇదే విధమైన వ్యాఖ్యలు చేసింది. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. అమెరికా (America)తో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ తెలిపింది. తమ ప్రతికార దాడులకు ట్రంప్ భయపడ్డారని పేర్కొంది. అమెరికాను నమ్మలేమని స్పష్టం చేసింది.
Trump Iran tensions | తగ్గిన ముడి చమురు ధరలు
ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఐదు రోజుల పాటు దాడులను నిలిపివేయాలని ట్రంప్ ఆదేశించడంతో ముడి చమురు ధరలు (Crude Oil) 14 శాతం వరకు పడిపోయాయి. రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పడంతో క్రూడ్ ఆయిల్ ధరలు దిగి వచ్చాయి. అయితే ఎలాంటి చర్చలు లేవని ఇరాన్ పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం నార్త్ సీ క్రూడ్ ధరలు సుమారు బ్యారెల్‌కు 104.70 డాలర్లకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర బ్యారెల్‌కు 91.41 డాలర్లకు చేరింది.
దీనిని కూడా చదవండి : Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు వాయిదా

