Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Pharma Tariffs | డొనాల్డ్ టారిఫ్ ట్రంప్!.. మళ్లీ సుంకాలతో భయపెడుతున్న యూఎస్ ప్రెసిడెంట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Pharma Tariffs | డొనాల్డ్ టారిఫ్ ట్రంప్!.. మళ్లీ సుంకాలతో భయపెడుతున్న యూఎస్ ప్రెసిడెంట్

అంతర్జాతీయం

Trump Pharma Tariffs | డొనాల్డ్ టారిఫ్ ట్రంప్!.. మళ్లీ సుంకాలతో భయపెడుతున్న యూఎస్ ప్రెసిడెంట్

నిత్యం వార్తల్లో ఉండడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్ బాంబు వేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 10:55 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Trump Pharma Tariffs

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Pharma Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం వార్తల్లో ఉండడం కోసం సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. సుంకాలతో భయపెట్టడం ఆయనకు హాబీగా మారిపోయింది.

Contents
  • Trump Pharma Tariffs | ఈసారి ఫార్మా వంతు..
    • Trump Pharma Tariffs | యూఎస్‌లో ఉత్పత్తి చేస్తే మినహాయింపులు..
      • Trump Pharma Tariffs | మన కంపెనీలపై ప్రభావమెంత?

మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (Make America Great Again) నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక పరిస్థితి మరింత దిగజారింది. శత్రుదేశమా, మిత్రదేశమా అన్న విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారీతిన పన్నులు బాదుతూ ముందుకు వెళ్తున్నారు. తమతో ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోని దేశాలపై ఎడాపెడా రెసిప్రోకల్ టారిఫ్స్ విధించారు.

Trump Pharma Tariffs | ఈసారి ఫార్మా వంతు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై ఎడాపెడా విధించిన టారిఫ్‌లను చట్ట విరుద్ధమంటూ అక్కడి సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు ఇచ్చినా ఆయన తీరులో మార్పు కనిపించడం లేదు. కొత్తకొత్త పన్నులతో ఆయన ముందుకు వస్తూనే ఉన్నారు. తాజాగా ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్ బాంబు వేశారు. కొన్నిరకాల పేటెంట్ ఔషధాలపై 100 శాతం వరకు సుంకాలు విధించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ (Executive Order)పై ట్రంప్ సంతకం చేయడం గమనార్హం.

Trump Pharma Tariffs | యూఎస్‌లో ఉత్పత్తి చేస్తే మినహాయింపులు..

‘మోస్ట్ ఫేవర్డ’ కింద ఒప్పందాలు చేసుకున్న ఫార్మా కంపెనీలు (Pharmaceutical Companies) అమెరికాలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేస్తే వాటి పేటెంట్, ఇతర ఉత్పత్తులకు ఎలాంటి సుంకాలు ఉండవని, ఒప్పందం చేసుకోని కంపెనీలు అలాంటి ప్రాజెక్టులు చేపడితే మాత్రం సుంకాలు వర్తిస్తాయని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో పేర్కొన్నారు. అలాంటి సంస్థలు ఉత్పత్తి చేసే ఔషధాలపై మొదట 20శాతం సుంకాలు విధించనున్నారు. వచ్చే నాలుగేళ్లలో వీటిని వంద శాతానికి పెంచుతారు. కాగా ఒప్పందం చేసుకోవడానికి ట్రంప్ కొంత గడువు ఇచ్చారు. టారిఫ్‌లపై చర్చలు జరిపేందుకు పెద్ద కంపెనీలకు 120 రోజులు, మిగతా సంస్థలకు 180 రోజుల గడువిచ్చారు. ప్రస్తుతానికి జనరిక్, బయోసిమిలర్, అత్యవసర మందులకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు.

Trump Pharma Tariffs | మన కంపెనీలపై ప్రభావమెంత?

విదేశాల నుంచి దిగుమతయ్యే పేటెంట్ పొందిన మందులపై నూరు శాతం పన్ను విధిస్తామన్న ట్రంప్ ప్రకటనతో దేశీయ ఫార్మా కంపెనీలు ఒత్తిడికి గురవుతున్నాయి. గత సెషన్‌లో అమెరికాకు ఎగుమతులు చేసే ఫార్మా కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. అయితే ప్రస్తుతానికి మన కంపెనీలపై పెద్దగా ప్రభావం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే మన కంపెనీలు ఎక్కువగా జనరిక్ మందులను అమెరికాకు ఎగుమతి చేస్తుంటాయి. ఈ మందులపై ప్రస్తుతం పన్ను లేకపోవడంతో భారత ఫార్మా రంగానికి టారిఫ్‌ల భారం ప్రస్తుతానికి లేనట్లేనని భావిస్తున్నారు. భవిష్యత్తులో జనరిక్ మందులపై పన్నులు విధిస్తే మాత్రం భారత కంపెనీలకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా, బయోకాన్ వంటి కంపెనీలు జనరిక్ మందులతో పాటు పేటెంట్ పొందిన మందులు కూడా అమెరికాలో విక్రయిస్తున్నాయి. ఆయా కంపెనీలపై పన్నుల భారం పడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Iran B1 Bridge Attack | ఇరాన్​ B1 వంతెన ధ్వంసంపై స్పందించిన ఇరాన్​.. గల్ఫ్‌లోని 8 వంతెనల ‘హిట్-లిస్ట్’ విడుదల

India Energy Security | భారత ఇంధన భద్రత, నౌకల రక్షణపై దృష్టి సారించిన కేంద్రం..
Udan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో తక్కువ ధరకే స్నాక్స్
US War on Iran | మిడిల్ ఈస్ట్ యుద్ధం మరింత తీవ్రం.. ఇరాన్‌పై భారీ దాడులకు సిద్ధ‌మ‌వుతున్న అమెరికా
Iran Israel Conflict | ఇరాన్‌ అణు కేంద్రం ధ్వంసం.. సుప్రీం లీడర్​ ఎవరున్నా చంపుతామన్న ఇజ్రాయెల్
Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
TAGGED:Donald Trumpdrug tariffseconomic impactExecutive OrderGlobal TradeIndian pharma companiesMake America Great Againpharma industryPharmaceutical CompaniesSupreme CourtTrump Pharma TariffsUS Trade Policy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Badam Milk Incident Badam Milk Incident | జాతరలో విక‌టించిన బాదం పాలు.. 80 మందికి అస్వస్థత, ఆసుపత్రుల్లో చికిత్స
Next Article Car Fell Into Well Car Fell Into Well | బావిలోకి దూసుకెళ్లిన కారు.. 9 మంది జల సమాధి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?