అక్షరటుడే, వెబ్డెస్క్ : Trump Tariff Refund | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు కోర్టు షాక్ ఇచ్చింది. టారిఫ్ల పేరిట వివిధ దేశాల నుంచి వసూలు చేసిన డబ్బులను రీఫండ్ చేయాలని ఆదేశించింది.
అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత సంవత్సరం ప్రవేశపెట్టిన సుంకాలకు రీఫండ్‌లను జారీ చేయాలని యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బుధవారం కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్‌ను ఆదేశించింది. డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల పేరుతో పలు దేశాలపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామనే కారణంతో భారత్ (India)పై 50శాతం టారిఫ్లు విధించారు. వాణిజ్య చర్చల నేపథ్యంలో దానిని 18శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో కోర్టు సుంకాలను కొట్టివేసింది. అంతేగాకుండా సుంకాల పేరిట ఇన్ని రోజులు అక్రమంగా వసూలు చేసిన డబ్బును రీఫండ్ చేయాలని తాజాగా తీర్పు చెప్పింది.
Trump Tariff Refund | 15 శాతం టారిఫ్లు
సుంకాలను కోర్టు కొట్టివేయడంతో మరోమార్గంలో టారిఫ్లు విధిస్తానని ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ ఈ వారం అమెరికా 15 శాతం గ్లోబల్ టారిఫ్ (Global Tariff) ను అమలు చేసే అవకాశం ఉందన్నారు. కాగా ట్రంప్ విధించిన సుంకాలతో అమెరికాకు సుమారు 130 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. దీంతో ప్రపంచ రవాణా, పోస్టల్ సంస్థ FedEx సహా కంపెనీలు సుంకాల పూర్తి వాపసు కోరుతూ కోర్టును ఆశ్రయించాయి.
ఇది కూడా చదవండి..: Donald Trump Health | ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు.. ఆరోగ్యంపై మొదలైన కొత్త చర్చ

