అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump War Statement | ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచంలోని అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. గ్యాస్, ఆయిల్ కొరత (Oil Shortage)తో అల్లాడుతున్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఆయా దేశాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
యుద్ధం ముగింపుపై తాజాగా ట్రంప్ ప్రకటన చేశారు. హర్మూజ్ ప్రస్తావన లేకుండానే యుద్ధం ముగింపుపై స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విషయమై ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అమెరికాతో అగ్రిమెంట్ చేసుకోవాలని ఇరాన్ తహతహలాడుతోందన్నారు. . త్వరలోనే ఈ డీల్‌ను ఫినిష్ చేస్తామని చెప్పారు. యుద్ధంతో నష్టపోయిన ఇరాన్ కోలుకోవడానికి 15-20 ఏళ్ల సమయం పడుతుందని తెలిపారు.
Trump War Statement | ఒప్పందం లేకుండానే..
ఇరాన్‌లో అమెరికా సైనిక చర్యలు వారాల్లో ముగియవచ్చని ట్రంప్ (Donald Trump) తెలిపారు. టెహ్రాన్‌తో అధికారిక ఒప్పందం లేకుండానే వాషింగ్టన్ తన సైనిక చర్యను ముగించే దశకు చేరుకుందని పేర్కొన్నారు. అమెరికా చాలా త్వరలో వైదొలగుతుంది అని ట్రంప్ అన్నారు. బహుశా రెండు వారాల్లో లేదా మూడు వారాల్లో యుద్ధం నుంచి బయటకు వస్తామని తెలిపారు. ఉపసంహరణకు ముందు అమెరికా బలగాలు పనిని పూర్తి చేస్తున్నాయని వెల్లడించారు.
Trump War Statement | అమెరికాకు నష్టం
ఇరాన్‌పై ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడంతో యుద్ధం ప్రారంభం అయింది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ (Iran Supreme Leader Khamenei) చనిపోయారు. అయితే ఇరాన్‌ను సులువుగా గెలుస్తామని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. కానీ ఇరాన్‌లోని ఐఆర్జీసీ తీవ్రంగా ప్రతిదాడులకు దిగింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేయడంతో పాటు గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, చమురు నిల్వ క్షేత్రాలపై క్షిపణులను ప్రయోగించింది. దీంతో అమెరికా సైతం తీవ్రంగానే నష్టపోయింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. ఈ ప్రభావం అమెరికాపై కూడా పడింది. దీంతో యుద్ధం వద్దంటూ కోట్లాది మంది అమెరికా ప్రజలు ఇటీవల నిరసన తెలిపారు. ఈ క్రమంలనే యుద్ధం ముగించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Russia Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఏఎన్-26 సైనిక విమానం కుప్పకూలి 29 మంది మృతి
