అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump Warns Iran | హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్టు చేశారు. ‘ఒప్పందం కుదుర్చుకోవడానికి లేదా హార్ముజ్ జలసంధిని తెరవడానికి నేను ఇరాన్‌కు పది రోజుల గడువు ఇచ్చాను. ఈ విషయం మీకు గుర్తుందా? సమయం మించిపోతోంది.. 48 గంటల్లో వారిపై ప్రళయం విరుచుకుపడుతుంది” అని హెచ్చరించారు.
Trump Warns Iran | ముగియనున్న గడువు
ట్రంప్ ఇటీవల ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం లేదా హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఆయన ఇరాన్‌కు పది రోజుల సమయం ఇచ్చారు. ఇందులో ఏప్రిల్ 6వ తేదీ వరకు విధించిన గడుగును అమెరికా అధ్యక్షుడు తాజాగా ఇరాన్‌కు గుర్తు చేశారు.
US President Donald Trump posts on Truth Social, “Remember when I gave Iran ten days to make a deal or open up the Hormuz Strait. Time is running out – 48 hours before all Hell will reign down on them…” pic.twitter.com/aJUlR09ni8
— ANI (@ANI) April 4, 2026
ఇది కూడా చదవండి.: Iran Downs US Jets | అమెరికా యుద్ధ విమానాలు కూల్చి వేసిన ఇరాన్
