Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: TTD Demonetized Notes | తిరుమల హుండీలో రద్దైన‌ నోట్ల గుట్ట.. రూ.400 కోట్ల ర‌ద్దైన నోట్ల‌తో టీటీడీకి తలనొప్పి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - TTD Demonetized Notes | తిరుమల హుండీలో రద్దైన‌ నోట్ల గుట్ట.. రూ.400 కోట్ల ర‌ద్దైన నోట్ల‌తో టీటీడీకి తలనొప్పి

ఆంధ్రప్రదేశ్​భక్తి

TTD Demonetized Notes | తిరుమల హుండీలో రద్దైన‌ నోట్ల గుట్ట.. రూ.400 కోట్ల ర‌ద్దైన నోట్ల‌తో టీటీడీకి తలనొప్పి

తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు సమర్పిస్తున్న రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్ల విలువ దాదాపు రూ.400 కోట్లకు చేరడంతో టీటీడీకి పెద్ద సవాలుగా మారింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 7, 2026 11:07 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
TTD Demonetized Notes

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TTD Demonetized Notes | తిరుమలలోని తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం (Tirumala Venkateswara Temple) హుండీలో భక్తులు సమర్పిస్తున్న పాత నోట్ల సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. టీటీడీకి ఇది పెద్ద సవాలుగా మారింది.

Contents
  • TTD Demonetized Notes | పరకామణిలో వేరు చేసి నిల్వ
    • TTD Demonetized Notes | రూ.35 లక్షల విలువైన రూ.2000 నోట్లు

తాజా అంచనాల ప్రకారం, రూ.500, రూ.1000 పాత నోట్ల రూపంలో దాదాపు రూ.400 కోట్ల మేర నిధులు హుండీలో పేరుకుపోయినట్లు తెలుస్తోంది. దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగినప్పటికీ, భక్తులు తమ మొక్కులు తీర్చుకునే క్రమంలో ఇప్పటికీ ఈ పాత నోట్లను హుండీలో వేస్తూనే ఉన్నారు. భక్తి భావంతో సమర్పించిన కానుకలను తిరస్కరించడం టీటీడీ (TTD)కి సాధ్యం కాకపోవడంతో, ఈ నోట్లను స్వీకరించక తప్పడం లేదు.

TTD Demonetized Notes | పరకామణిలో వేరు చేసి నిల్వ

హుండీ లెక్కింపు (పరకామణి) సమయంలో సిబ్బంది ఈ పాత నోట్లను ప్రత్యేకంగా వేరు చేసి భద్రపరుస్తున్నారు. అయితే సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ మొత్తం భారీగా పేరుకుపోయి ఇప్పుడు వందల కోట్లకు చేరింది. వినియోగించలేని ఈ నిధులు టీటీడీకి ఆర్థికంగా ఉపయోగపడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.ఈ సమస్య పరిష్కారానికి టీటీడీ యాజమాన్యం పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ను ఆశ్రయించింది. రద్దు నోట్లను మార్పిడి చేసుకునేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. టీటీడీకి ప్రత్యేకంగా అనుమతి ఇస్తే ఇతర సంస్థలు కూడా ఇదే విధంగా డిమాండ్ చేసే అవకాశం ఉందన్న కారణంతో కేంద్రం వెనుకంజ వేస్తోందని సమాచారం.

TTD Demonetized Notes | రూ.35 లక్షల విలువైన రూ.2000 నోట్లు

ఇదిలా ఉంటే, రద్దు చేసిన రూ.2000 నోట్లను కూడా భక్తులు హుండీలో సమర్పిస్తున్నారు. టీటీడీ అధికారులు (TTD Officers) తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి నెల సుమారు రూ.35 లక్షల విలువైన రూ.2000 నోట్లు హుండీలో వస్తున్నాయి. వీటిని ప్రతి రెండు నెలలకు ఒకసారి చెన్నైలోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో మార్పిడి చేసుకుంటున్నారు. రూ.400 కోట్లకు చేరిన పాత నోట్లను వినియోగించలేకపోవడం టీటీడీకి పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ నిధులు ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం అవి నిల్వలోనే ఉండిపోతున్నాయి. ఈ సమస్యకు కేంద్రం, ఆర్బీఐ నుంచి ప్రత్యేక అనుమతి వచ్చినప్పుడే పరిష్కారం లభించే అవకాశముంది. అప్పటి వరకు హుండీలో పాత నోట్ల రూపంలో పేరుకుపోతున్న నిధులు టీటీడీకి తలనొప్పిగానే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి..: Karna | కర్ణ మరణం నుంచి కష్టాల వరకు.. ‘సవాలక్ష’ అనే పదం ఎలా వచ్చిందంటే!

Tirumala VIP Break Darshan | 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Nallamala Forest Fire | మహానంది నల్లమలలో భారీ కార్చిచ్చు.. వన్యప్రాణుల మనుగడకు ముప్పు!
March 07 Horoscope | దీర్ఘకాలిక అనారోగ్యం దూరం.. ఆ రాశుల వారికి ఇక సంపూర్ణ ఆరోగ్య యోగం!
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
TAGGED:Andhra Pradesh Newsdemonetized notes issuehundi collectionsold currency IndiaRBI IndiaReserve Bank of Indiatemple funds problemTirumala TempleTirumala Venkateswara TempleTTDTTD NewsTTD Officers
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Air India CEO Resignation Air India CEO Resignation | ఎయిరిండియా సీఈఓ రాజీనామా
Next Article Stock Market Losses Stock Market Losses | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?