అక్షరటుడే, వెబ్డెస్క్ : TTD Ghee Tanker Accident | కడప జిల్లా (Kadapa District)లో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన చోటుచేసుకుంది.తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కోసం తీసుకెళ్తున్న నెయ్యి ట్యాంకర్ (Ghee Tanker) బోల్తా పడటంతో అందులోని నెయ్యిని స్థానికులు భారీగా తీసుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది.
జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం (Kondapuram Mandal) చిత్రావతి వంతెన సమీపంలో ఈ సంఘటన జరిగింది. పూణే నుంచి తిరుమలకు వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంతో ట్యాంకర్‌లోని నెయ్యి బయటకు కారడం ప్రారంభమైంది.
TTD Ghee Tanker Accident | మొత్తం ఖాళీ..
ఈ విషయం తెలిసిన వెంటనే పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా పెట్రోల్ లేదా ఆయిల్ ట్యాంకర్లు (Oil Tankers) ప్రమాదానికి గురైతే కొంతమంది చమురును బిందెలలో పట్టుకుని తీసుకెళ్లిన ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. అయితే ఈసారి నెయ్యి ట్యాంకర్ కావడంతో అక్కడికి వచ్చిన వారు మరింతగా ఎగబడ్డారు. బిందెలు, బకెట్లు, చెంబులు, వాటర్ బాటిల్స్… చేతికి దొరికిన ప్రతి వస్తువుతో నెయ్యిని తీసుకెళ్లడం ప్రారంభించారు. కొంతమంది అయితే పెద్ద డ్రమ్ములు తీసుకొచ్చి నెయ్యిని తోడేసినట్లు తెలుస్తోంది. కొద్ది సమయంలోనే ట్యాంకర్‌లో ఉన్న నెయ్యి దాదాపుగా ఖాళీ అయిపోయింది.
TTD Ghee Tanker Accident | 21 వేల లీటర్ల నెయ్యి ఉన్నట్లు సమాచారం
స్థానికుల ప్రకారం ట్యాంకర్‌లో మొత్తం సుమారు 21 వేల లీటర్ల నెయ్యి ఉన్నట్లు సమాచారం. అయితే ప్రజలు భారీగా తీసుకెళ్లడంతో చివరకు అందులో కేవలం 500 లీటర్ల నెయ్యి మాత్రమే మిగిలినట్లు అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అక్కడ గుమిగూడిన ప్రజలను చెదరగొట్టి పరిస్థితిని నియంత్రించారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున నష్టం జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ట్యాంకర్ బోల్తా పడడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగిందా లేదా వాహనంలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే తిరుమల (Tirumala)లో జరిగే నిత్యనైవేద్యాలు, ప్రసాదాల తయారీ కోసం భారీగా నెయ్యి వినియోగిస్తారు. ఆ నెయ్యి సరఫరా కోసం వస్తున్న ట్యాంకర్ ప్రమాదానికి గురవడం, అందులోని నెయ్యి స్థానికులు తీసుకెళ్లడం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది.
ఇది కూడా చదవండి..: Bride Elopes Wedding | పెళ్లిపీటల నుంచి లేచి.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు

