అక్షరటుడే, హైదరాబాద్: Tulam Gold Scheme | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత అమలు చేస్తున్న 6 గ్యారంటీల అమలుపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు IT and Industries Minister Sridhar Babu స్పందించారు.
ఎన్నికల సమయంలో తమ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుందని అన్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ప్రకటించిన విధంగా ‘కల్యాణ లక్ష్మి’తో పాటు తులం గోల్డ్ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Tulam Gold Scheme | అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే..
తులం బంగారం పథకం అమలుపై కసరత్తు జరుగుతోందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం ప్రయోజనం కల్పిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది సమయంలోనే రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
