అక్షరటుడే, న్యూఢిల్లీ: UAE India Missile Deal | భారత రక్షణ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. భారత్ రూపొందించిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థలపై United Arab Emirates (UAE) ఆసక్తి చూపుతోంది. అతి ముఖ్యంగా BrahMos missile, Akash air defence system కొనుగోలుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
UAE India Missile Deal | రక్షణ ఎగుమతులకు ఊతం
రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతతో భారత్ ముందంజలో ఉంటోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు UAE తో ఒప్పందం కుదిరితే, అంతర్జాతీయ రక్షణ రంగ మార్కెట్లో భారత్ మరింత బలపడే అవకాశం ఉంది.
UAE India Missile Deal | బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకతలు
బ్రహ్మోస్ ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లలో ఒకటిగా ఉంది. దీనిని భూమి, గగనతలం, సముద్రం నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకునే సామర్థ్యం దీనికి ప్రత్యేకత.
ఆకాశ్ ప్రాధాన్యం
శత్రు విమానాలు, డ్రోన్లు, మిస్సైళ్లను అడ్డుకునే సామర్థ్యం ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సొంతం. తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యం ప్రదర్శించే ఈ వ్యవస్థపై అనేక దేశాలు ఆసక్తి కనబర్చుతున్నాయి.
భాగస్వామ్యం బలోపేతం
భారత్ – UAE సంబంధాలు గత కొన్నేళ్లుగా బలపడుతూ వస్తున్నాయి. వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం మరింతగా పెరుగుతోంది. ఇప్పుడు తాజా ఒప్పందం కూడా కుదిరితే.. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా పటిష్టం అవుతుందని భావిస్తున్నారు.
గల్ఫ్ భద్రతపై ప్రభావం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడమే UAE లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆకాశ్, బ్రహ్మోస్ వ్యవస్థలను కొనుగోలు చేయడం ద్వారా ఆ దేశ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒప్పందం అమల్లోకి వస్తే..
- భారత రక్షణ రంగంలో ఎగుమతులు పెరుగుతాయి.
- ‘మేక్ ఇన్ ఇండియా’కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు మరింతగా పెరుగుతుంది.
- ఇతర దేశాలు సైతం భారత ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!

