అక్షరటుడే, కామారెడ్డి : Ugadi Celebrations | ఉగాది సందర్భంగా కామారెడ్డి (Kamareddy) జిల్లాలో వేడుకలు అంబరాన్నంటాయి. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణులు కాళికాదేవి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉగాది సందర్భంగా పలు గ్రామాల్లో ఎడ్ల బాండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.
కామారెడ్డి పట్టణంలోని వీక్లి మార్కెట్లో (Weekly Market) ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రారంభించారు. సదర్ సంఘం ఆధ్వర్యంలో వివిధ సంఘాలకు సంబంధించిన ఎడ్ల బండ్లు మార్కెట్లో ఉన్న ఆలయాల చుట్టూ తిరిగాయి. ఎడ్ల బండ్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఉరేగింపు సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Ugadi Celebrations | తరలివచ్చిన ప్రజలు
ఎడ్ల బండ్ల ఉరేగింపు తిలకించేందుకు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కామారెడ్డితో పాటు వివిధ గ్రామాల్లో ఎడ్ల బండ్లను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, వైస్ ఛైర్పర్సన్ కాసర్ల గోదావరి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, సదర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

గోపాల్‌పేటలో..
నాగిరెడ్డిపేట (Nagireddypet) మండల కేంద్రం గోపాల్‌పేటలో సైతం బండ్ల ప్రదర్శన నిర్వహించారు. నల్ల పోచమ్మ ఆలయం చుట్టూ పలు గ్రామాల ప్రజలను ఎండ్ల బండ్లను తిప్పారు. ఈ వేడుకలు తిలకించేందుకు మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి : Ugadi Celebrations Nizamabad | నగరంలోని నవదుర్గ దేవాలయంలో ఉగాది వేడుకలు

