అక్షరటుడే, హైదరాబాద్ : Horse Gram | మనం అనేక రకాల పప్పుల గురించి వింటుంటాం. కానీ కొన్ని అరుదైన పప్పుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. అలాంటి వాటిలో ఒకటి ఉలవలు (Horse Gram). ఇవి కేవలం శక్తిని మాత్రమే కాక, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఉలవల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ముఖ్యంగా ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక దగ్గు, ఉబ్బసం, మూత్రపిండాల్లో రాళ్లు, క్రమరహిత పీరియడ్స్ వంటి సమస్యలకు ఉలవలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఉలవలు తినడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు:
బరువు తగ్గడంలో సహాయం (Weight Loss): బరువు తగ్గాలనుకునే వారికి ఉలవలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో కేలరీల పరిమాణం తక్కువగా, ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈ పోషకాలు ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఉలవలు తీసుకోవడం వల్ల జీవక్రియ (మెటబాలిజం) మెరుగవుతుంది.
గుండె ఆరోగ్యం మెరుగుదల: ఉలవల్లోని ఫైబర్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ (LDL)ను కరిగించడంలో సహాయపడుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన ఈ చెడు కొవ్వులను కరిగించి, గుండెకు రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి. తద్వారా గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడటంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి.
మలబద్ధకం నివారణ (Relief from Constipaonti): ఉలవల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికలను మెరుగుపరుస్తుంది, మలం సాఫీగా బయటకు వచ్చేలా చేసి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇది పరోక్షంగా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
మూత్రపిండాల్లో రాళ్ల నివారణ (Kidney Stones): ఉలవలు మూత్రవిసర్జనను (Diuretic) పెంచే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది హానికరమైన పదార్థాలు, అలాగే మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను మూత్రం ద్వారా శరీరం నుండి తొలగించడంలో సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడకుండా నివారించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెప్తుతున్నారు.
జ్వరం, దగ్గు ఉపశమనం: జ్వరంతో పాటు ఆయాసం, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు ఉలవల కషాయం తాగడం చాలా మంచిది. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది.
శారీరక, మానసిక ఎదుగుదల: పెరుగుతున్న పిల్లలకు ఉలవలు తినిపించడం చాలా మంచిది. ఇవి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు సహాయపడి, వారిని బలంగా ఉంచుతాయి.
ఎక్కిళ్లకు పరిష్కారం: తరచుగా ఎక్కిళ్ల సమస్యతో బాధపడేవారు ఉలవలు తీసుకోవడం మంచిది. ఉలవలు తీసుకోవడం ద్వారా ఎక్కిళ్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది.
సంతానోత్పత్తికి మద్దతు (Fertility): తక్కువ స్పెర్మ్ కౌంట్ కారణంగా సంతానోత్పత్తి సమస్యలను (Fertility Problems) ఎదుర్కొంటున్న పురుషులకు కూడా ఉలవలు తినటం మంచిది. అయితే, ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే వీటిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
మూత్రంలో మంట తగ్గించడం: తరచూ మూత్రంలో మంటతో బాధపడేవారు, ఒక కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరి నీళ్లు కలిపి తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.
ఈ విధంగా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఉలవలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.


