అక్షరటుడే, కామారెడ్డి: Unseasonal Rain Damage | కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో పాటు పలు ప్రాంతాల్లో వడగళ్లు కురిశాయి.
Unseasonal Rain Damage | తీవ్రంగా పంట నష్టం..
సుమారు గంటపాటు కురిసిన వర్షానికి వరి, మొక్కజొన్న, జొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. భిక్కనూరు మండలం కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, లక్ష్మీదేవుని పల్లి గ్రామాలలో రాళ్ల వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు.

గేదెలు మృత్యువాత..
రాళ్ల వర్షానికి పలుచోట్ల ధాన్యం నేలరాలిపోయింది. సదాశివనగర్ మండలం భూంపల్లి, లింగంపల్లి గ్రామాలలో ఈదురుగాలులకు వందల ఎకరాలలో మొక్కజొన్న పంట నేలకొరిగింది.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి. వీటి విలువ సుమారు రూ. 1.50 లక్షలు ఉంటుందని బాధిత రైతు వాపోయారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు విన్నవిస్తున్నారు.

