అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Unseasonal Rains | జిల్లాలో అకాల వర్షాల కారణంగా పసుపు రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. చేతికిందిన పసుపు పంటను మార్కెట్‌కు తీసుకొచ్చినప్పటికీ వర్షాల కారణంగా యార్డులో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.

Unseasonal Rains | నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో..
నిజామాబాద్ మార్కెట్ యార్డ్ (Nizamabad Market Yard)కు మొత్తంగా 16,900 క్వింటాళ్ల పసుపు వచ్చింది. మార్కెట్‌కు వచ్చిన పసుపు కొమ్ములను దాదాపు 70 నుంచి 80శాతం వరకు షెడ్లలో ఉంచుతున్నారు. అయితే ఎక్కువగా పసుపు యార్డ్‌కు రావడంతో మార్కెట్లోని ఖాళీ ప్రదేశాల్లోనూ కొమ్ములను ఉంచారు. కాని సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి యార్డులోని ఖాళీ ప్రదేశాల్లో ఉంచిన పసుపు పూర్తిగా తడిసిపోయింది. నీళ్లలో మునిగిపోయింది. వర్షాలను ముందుగానే పసిగట్టి ముందుగానే రైతులు టార్పాలిన్లతో పసుపును కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ గాలి దుమారంతో కూడిన వర్షం పడడంతో పసుపు పూర్తిగా తడిసిపోయింది. యార్డుకు తెచ్చిన పంట తడవకుండా ఉండేందుకు అధికారులు సైతం ఏర్పాట్లు చేశారు. కానీ మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో పసుపు రావడంతో నష్టం ఏర్పడింది.

ఇది కూడా చదవండి..: Nizamabad Bike Accident | బైక్ అదుపు తప్పి యువకుడి మృతి
