అక్షరటుడే, వెబ్‌డెస్క్: UPSC Civil Services Results | సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025 (Civil Services Exam 2025) తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటించింది. ఫలితాల అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అధికారులు ఫలితాలను ప్రకటించారు. పర్సనాలిటీ టెస్ట్ రౌండ్‌కు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో తుది మెరిట్ జాబితాను చూసుకోవచ్చు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ తుది ఫలితాలను నేడు ప్రకటించింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేశారు. యూపీఎస్సీ వెబ్‌సైట్ (UPSC Website) ఓపెన్ చేస్తే అందులో ఎంపికైన వారి లిస్ట్ ఉంటుంది. ఈ పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని అభ్యర్థులు తమ నంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. వివిధ సర్వీసులకు ఎంపికైన అభ్యర్థుల పేర్లతో కూడిన మెరిట్ జాబితాను కమిషన్ విడుదల చేసింది.
UPSC Civil Services Results | 979 ఖాళీలు
సివిల్స్ పరీక్షల ద్వారా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS), ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇతర గ్రూప్ A మరియు గ్రూప్ B కేంద్ర సేవలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ 979 ఖాళీలను భర్తీ చేయడానికి 2025 సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహించింది.
UPSC Civil Services Results | 15 రోజుల్లో మార్కుల షీట్
ప్రస్తుతం ఎంపికైన వారి జాబితాను మాత్రమే యూపీఎస్సీ ప్రకటించింది. 15 రోజుల్లోపు అభ్యర్థుల మార్క్‌షీట్‌లను కమిషన్ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్ చేస్తామని పేర్కొంది. అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి మార్కులు 30 రోజుల పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Telangana Engineering Fees | ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. అత్యధికంగా సీబీఐటీలో..

