అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Urban Forest Parks | అర్బన్ పార్కులతో ప్రజలకు ఆహ్లాదం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. హుస్నాబాద్ (Husnabad) జిల్లలగడ్డ వద్ద అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులను ఆదివారం పరిశీలించారు.
తెలంగాణలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అర్బన్ పార్కుల నిర్మాణం పూర్తయింది. వీటిలో సేద తీరడానికి భారీగా ప్రజలు వస్తున్నారు. ఈ క్రమంలో జిల్లలగడ్డ వద్ద సైతం పార్కు పనులు చేపట్టారు. పార్కులో మట్టి ట్రాక్, వాటర్ సంపు , గజ్బౌల్ పనులు పూర్తయినట్లు అధికారులు మంత్రికి వివరించారు. పిల్లల కోసం ఆట స్థలం, చిల్డ్రన్ పార్కు ఏర్పాటు చేయాలని పొన్నం ఆదేశించారు. న్యాచురల్‌గా ఉండే ట్రెక్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
Urban Forest Parks | కేబుల్ బ్రిడ్జి
పుట్టలొద్ది, గాడిద లొద్ది మధ్య లక్నవరం లాంటి కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రెండో దశలో మరిన్ని సంపులు నిర్మించాలన్నారు. వాచ్టవర్లు ఎత్తైన గుట్టలపై నిర్మించాలన్నారు. వాటిపైకి ఎక్కి చూస్తే ప్రకృతి అందాలు కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు.
Urban Forest Parks | చెరువుల పరిశీలన
హుస్నాబాద్ పట్టణంలోని కొత్త చెరువు , ఎల్లమ్మ చెరువు, పల్లె చెరువు అభివృద్ధి పనులు మంత్రి పరిశీలించారు. సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎల్లమ్మ చెరువులో నిర్మిస్తున్న గ్లాస్ బ్రిడ్జి (Glass Bridge) పనులు పరిశీలించారు. కట్టపైన ఓపెన్ జిమ్, గుట్టపై వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి : Monsoon Rainfall Deficit | రైతులకు అలెర్ట్.. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే
