అక్షరటుడే, ఎల్లారెడ్డి: Urea Shortage | యూరియా కోసం రైతులు (Farmers) తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్లో యూరియా బుక్ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
Urea Shortage | తెల్లవారుజాము నుంచే..
సొసైటీకి వచ్చిన యూరియా (Urea)ను దక్కించుకునేందుకు ఆయా కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కడుతున్నారు. గంటల తరబడి నిరీక్షణ తప్పకపోవడంతో, లైన్‌లో తమ స్థానాన్ని రిజర్వ్ చేసుకోవడానికి గండి మాసానిపేట సింగిల్ విండో కార్యాలయం వద్ద శనివారం చెప్పులను క్యూలో పెట్టి రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా ఎప్పుడు వస్తుంది.. ఆన్లైన్లో ఎప్పుడు పెడతారనే విషయాలు తెలుసుకునేందుకు ఫోన్లు ముందు పెట్టుకొని నిరీక్షిస్తున్నారు. రైతులు ఉదయం 5 గంటల నుంచే సొసైటీల ముందు పడిగాపులు కాస్తున్నారు.
Urea Shortage | పంట కాలంలో..
పంట కాలంలో ఎరువులు అందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతగా ఎదురుచూశాక వచ్చిన అరకొర యూరియా బస్తాల కోసం అన్నదాతల్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతోంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా అందుబాటులో ఉంచాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Indiramma Houses | సీఎం మాట నిలబెట్టుకున్నారు..: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

