Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: urea shortage warning | యూరియా కొరత వచ్చే అవకాశం : సీఎం రేవంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - urea shortage warning | యూరియా కొరత వచ్చే అవకాశం : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణ

urea shortage warning | యూరియా కొరత వచ్చే అవకాశం : సీఎం రేవంత్​రెడ్డి

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 22, 2026 7:46 సా.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
urea shortage warning

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : urea shortage warning | రాష్ట్రంలో రానున్న రోజుల్లో యూరియా కొరత వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. పశ్చిమాసియా యుద్ధం ఇలాగే కొనసాగితే యూరియా సమస్య వస్తుందన్నారు. బీజేపీ ఎంపీలు సహకరించి తెలంగాణలో యూరియా కొరతను ఎదుర్కొనడానికి ప్రధాని మోదీతో మాట్లాడాలన్నారు.

Contents
  • urea shortage warning | పంట మార్పిడిపై..
    • urea shortage warning | 2029లో కాంగ్రెస్​ గెలుస్తుంది
      • urea shortage warning | బీఆర్​ఎస్​ది మొసలి కన్నీరు

సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆదివారం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పర్యటించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసగించారు. తమ ప్రభుత్వం ఏ నియోజకవర్గంపై వివక్ష చూపదన్నారు. మిగతా నియోజకవర్గాల్లాగే సిద్దిపేటకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు అందించామన్నారు. గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు అలాగే ఇచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ (KCR), కేటీఆర్, హరీశ్ రావుతో తనకు రాజకీయంగా విబేధాలు ఉండొచ్చన్నారు. ఆ కారణంతో ఆ ప్రాంతాల్లోని పేదలకు అన్యాయం చేయకూడదనే తన ఉద్దేశం అన్నారు.

urea shortage warning | పంట మార్పిడిపై..

పంట మార్పిడికి అవసరమైన ప్రణాళికలు చేయాలని మంత్రి తుమ్మలకు సీఎం సూచించారు. పంట మార్పిడి ద్వారా రైతులను లాభసాటిగా మార్చాలన్నారు. పామ్​ ఆయిల్​  (Oil Palm) సాగును ప్రోత్సాహించాలన్నారు. సిద్దిపేటలో కట్టిన ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ లాంటిదే కొడంగల్‌లో కూడా కట్టించాలని తుమ్మలను కోరారు. తాను సీఎం అయ్యాకే సిద్దిపేటలో పామ్​ ఆయిల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించామని తెలిపారు. కావాలంటే ఫ్యాక్టరీని కొడంగల్‌కు తరలించి ఉండొచ్చన్నారు. ఇక్కడి రైతుల సంక్షేమం కోసం ఫ్యాక్టరీ నిర్మించామని తెలిపారు. వివక్ష తమ ఇంటా వంటా లేదన్నారు.

urea shortage warning | 2029లో కాంగ్రెస్​ గెలుస్తుంది

పేదల కోసం తమ ప్రభుత్వం పని చేస్తుంది కానీ, రాజకీయ నాయకుల కోసం కాదని సీఎం స్పష్టం చేశారు. 2029లో మళ్లీ కాంగ్రెస్ (Congress)​ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్​ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. సిద్దిపేటలో గెలిచిన అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.

urea shortage warning | బీఆర్​ఎస్​ది మొసలి కన్నీరు

కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులను 98.5 శాతం రైతులు భూములు ఇచ్చాకే ప్రారంభించామని సీఎం తెలిపారు. ఏటిగడ్డ-కిష్టాపూర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ కట్టినప్పుడు రైతుల పట్ల గత ప్రభుత్వం వ్యవహరించిన అందరికీ తెలుసన్నారు. మూసీ ప్రాజెక్ట్​ విషయంలో పేదల పట్ల బీఆర్​ఎస్​ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు.

దీనిని కూడా చదవండి : TPCC Chief District Tour | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన

Hyderabad Furniture Mall Fire | హైదరాబాద్‌లో అర్ధ‌రాత్రి భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ మాల్ దగ్ధం, కోట్ల రూపాయల నష్టం
Telangana Weather Alert | రైతులకు అలెర్ట్​.. ఆ ప్రాంతాల్లో అకాల వర్షాలు!
Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత
Telangana Speaker Decision | స్పీకర్​ కీలక నిర్ణయం.. కడియం, దానం అనర్హత పిటిషన్ల కొట్టివేత
Gas Cylinder Booking | గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువు 45 రోజులకు పెంపు
TAGGED:fertilizer crisisindia agricultureRevanth ReddyTelangana newsurea shortagewest asia conflict
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Driving License Test Driving License Test | ఆ పరీక్ష పాస్​ అయితేనే డ్రైవింగ్​ లైసెన్స్​
Next Article Lingampet wrestling competitions | Lingampet wrestling competitions | ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?