అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran US Embassy Attack | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తమ దేశంపై దాడితో పాటు సుప్రీం లీడర్ అయేతుల్లా ఆలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) హత్యకు ప్రతీకారంగా ఇరాన్ దాడులు చేస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేస్తుంది.
ఇరాన్ సోమవారం కువైట్‌లోని అమెరికా ఎంబసీపై దాడి చేసింది. డ్రోన్లతో దాడులు చేపట్టినట్లు సమాచారం. దాడిపై రాయబార కార్యాలయం, కువైట్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు డ్రోన్ దాడుల అనంతరం దౌత్య కార్యాలయంపై పెద్ద ఎత్తున నల్లటి పొగ అలుముకుంది. ఇరాన్ కువైట్‌పై క్షిపణులు, యూఏవీలతో దాడులు చేస్తోంది. ప్రజలు ఎవరు కూడా రాయబార కార్యాలయానికి రావొద్దని ఎంబసీ అధికారులు (Embassy Officers) సూచించారు.
Iran US Embassy Attack | 32 మందికి గాయాలు
కువైట్‌పై సోమవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. అనేక డ్రోన్లను అడ్డుకున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఒకరు మరణించారని, 32 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్లు విరుచుకుపడుతున్నాయి. ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
Iran US Embassy Attack | గాంధీ ఆస్పత్రి ధ్వంసం
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లోని గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital) ధ్వంసం అయింది. దీంతో అధికారులు రోగులను తరలించారు. ఆస్పత్రులపై దాడులు ఆందోళనకరమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ అన్నారు. మరో మూడు ఇతర హాస్పిటల్స్‌పై సైతం ఇజ్రాయెల్ ఎటాక్ చేసింది. పాఠశాలపై దాడి చేయగా.. అనేక మంది విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..: Pakistan Afghanistan Border Clash : 400 మందికి పైగా తాలిబాన్ సైనికులు మరణించారు.. 46 ప్రదేశాలు దెబ్బతిన్నాయి: పాక్ మంత్రి

