అక్షరటుడే, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ విరుచుకుపడుతున్నాయి. కాగా.. ఇరాన్ సైతం ఇజ్రాయిల్‌తో పాటు, కువైట్, దుబాయ్, బహ్రెయిన్‌లలోని అమెరికన్ ఎయిర్‌బేస్‌లపై దాడులు చేస్తోంది.
US Fighter Jets Crash | వీడియో విడుదల
కాగా.. తీవ్రస్థాయి దాడులు కొనసాగుతున్న వేళ కువైట్‌లో అమెరికా యుద్ధ విమానం కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను అక్కడి మీడియా షేర్ చేసింది. కువైట్ గగనతలంలో యుద్ధ విమానం మంటల్లో చిక్కుకొని కిందపడిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఇందులో పైలట్లు సురక్షితంగా బయటపడ్డట్లు సమాచారం. కాగా.. ఘటనపై కువైట్ రక్షణశాఖ స్పందిస్తూ.. పలు యూఎస్ మిలిటరీ విమానాలు కూలిపోయాయని పేర్కొన్నారు. సహాయక చర్యలు చేపట్టి, వాటిల్లోని సిబ్బందిని రక్షించామని తెలిపింది.
US Fighter Jets Crash | పొరపాటు వల్లనే..: అమెరికా
ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా వెళ్తున్న మూడు ఎఫ్-15 జెట్ విమానాలు కూలిపోవడంపై యూఎస్ స్పందించింది. పొరపాటున (ఫ్రెండ్లీ ఫైర్) కువైట్ డిఫెన్స్ ఫోర్సెస్ వీటిని కూల్చినట్లు పేర్కొన్నారు. కాగా.. ఈ ప్రమాదం నుంచి ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించింది. అయితే కూల్చివేతలను కువైట్ కూడా అంగీకరించిందని పేర్కొన్నారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరిలో తమకు సహకారం అందిస్తున్న కువైట్ దళాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపింది.
Good news for IRAN💪
American fighter jets shoot down…
Crash in Kuwait 💪💪 pic.twitter.com/6hJseUFRXr
— Iran’s Islamic Revolutionary Guard Corps (IRGC) (@IranMilittary) March 2, 2026
ఇది కూడా చదవండి..: Iran Underground Weapons | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇరాన్ భూగర్భ ఆయుధాల సొరంగం ఫుటేజ్ విడుదల..

