అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Immigration Offer | అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్ ఇచ్చింది. స్వచ్ఛందంగా దేశం వదిలివెళ్లే అక్రమ వలసదారులకు 2,600 డాలర్లు ఎగ్జిట్ బోనస్ ఇవ్వనున్నట్లు ట్రంప్ యంత్రాంగం వెల్లడిచింది. అంతేకాకుండా వారి స్వదేశాలకు విమానంలో ఉచితంగా పంపించడానికి ఏర్పాట్లు సైతం చేస్తామని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (Homeland Security) విభాగం ప్రకటించింది.
US Immigration Offer | వారిపై పేర్లను ఆ లిస్టు నుంచొ తొలగిస్తాం..
అక్రమ వలసదారులు తాము స్వదేశానికి తిరిగివెళ్లేందుకు సిద్ధమేనని ‘సీబీపీ హోమ్’ (CBP Home) యాప్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరింది. ఇలా నమోదు చేసుకున్న వారి పేర్లను బలవంతంగా స్వదేశానికి తరలించాల్సిన వారి లిస్టు నుంచి తొలగిస్తామని పేర్కొంది.

US Immigration Offer | 22 లక్షల మంది అక్రమ వలసదారులు తిరిగి వెనక్కి..
అమెరికా (America)లో నివసిస్తున్న అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపడానికి 2025 జనవరిలో చర్యలు చేపట్టామని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. తాము ఇస్తున్న ఆఫర్‌లను వినియోగించుకుంటున్నారని పేర్కొంది. 2025 నుంచి ఇప్పటివరకు 22 లక్షలకు పైగా అక్రమ వలసదారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయారని వెల్లడించింది. అమెరికాకు అక్రమంగా వచ్చిన వారికి స్వచ్ఛందంగా స్వదేశానికి తిరిగి వెళ్లడమే అతి సురక్షితమైన, చవకైన మార్గమని చెప్పింది. ఇలా చేయడం వల్ల అరెస్టు కాకుండా సురక్షితంగా తమ దేశానికి వెళ్లిపోవచ్చని తెలిపింది.
ఇది కూడా చదవండి..: India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్‌కు మోడీ ఫోన్.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!

