Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: US Iran Conflict | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు.. త్వరలో ఇరాన్​పై భీకర దాడులు చేస్తామని వెల్లడి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - US Iran Conflict | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు.. త్వరలో ఇరాన్​పై భీకర దాడులు చేస్తామని వెల్లడి

అంతర్జాతీయంతాజా వార్తలు

US Iran Conflict | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు.. త్వరలో ఇరాన్​పై భీకర దాడులు చేస్తామని వెల్లడి

అమెరికా అధ్యక్షుడు డొనాల్​ ట్రంప్​ సంచలన ప్రకటన చేశారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌తో మొదలైన సంఘర్షణ తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 2, 2026 9:58 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
US Iran Conflict

అక్షరటుడే, వెబ్​డెస్క్​: US Iran Conflict | అమెరికా అధ్యక్షుడు డొనాల్​ ట్రంప్​ సంచలన ప్రకటన చేశారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌తో మొదలైన సంఘర్షణ తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా దళాలు టెహ్రాన్ సైనిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీశాయని వెల్లడించారు. త్వరలోనే లక్ష్యాలను సాధించి ‘పని పూర్తి’ చేయబోతున్నామని పేర్కొన్నార. తమ ముఖ్య ఉద్దేశాలు దాదాపు పూర్తవుతున్నాయని వెల్లడించారు.

Contents
  • US Iran Conflict | ఇరాన్ కీలక నాయకత్వం అంతం
    • US Iran Conflict | ఇరాన్ వనరుల కోసం యుద్ధం చేయడం లేదు
      • ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుంది..
      • హర్మూజ్​తో పనిలేదు

US Iran Conflict | ఇరాన్ కీలక నాయకత్వం అంతం

ఇరాన్ కీలక నాయకత్వంతో పాటు, ఆ దేశ నాకౌదళం, ఎయిర్​ ఫోర్స్​ను నాశనం చేశామని ట్రంప్​ తెలిపారు. ఆ దేశ ప్రాంతీయ మద్దతు గ్రూపులను బలహీనపర్చామన్నారు. అలాగే అణు ఆయుధాలు తయారు చేసుకోకుండా అడ్డుకోవడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

US Iran Conflict | ఇరాన్ వనరుల కోసం యుద్ధం చేయడం లేదు

తమ సైనిక చర్యలు ఇరాన్ ఆయిల్​, సహజ వనరుల కోసం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలోని తమ మిత్రదేశాలను రక్షించడమే దీని వెనుక ప్రధాన ఉద్దేశమని వివరించారు. ‘‘మాకు వారి ఆయిల్​ గానీ, వారి వద్ద ఉన్న ఏ వనరూ అవసరం లేదు” అని ఆయన పేర్కొన్నారు. అమెరికా సహచరులకు మద్దతు ఇవ్వడం కోసమేనని తెలిపారు.

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుంది..

‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’తో ఇరాన్ ఆయుధ సామర్థ్యాలు గణనీయంగా తగ్గిపోయాయని ట్రంప్​ పేర్కొన్నారు. ఆ దేశం క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించే సామర్థ్యం భారీగా తగ్గిందన్నారు. ఆయుధ తయారీ కర్మాగారాలు, లాంచ్ వ్యవస్థలు తీవ్రంగా ధ్వంసమవుతున్నాయని ఆయన వెల్లడించారు. మా లక్ష్యాలు పూర్తయ్యే వరకు కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. వచ్చే రెండు-మూడు వారాల్లో ఇరాన్‌పై భారీ దాడులు చేస్తామని ప్రకటించారు. వారిని రాతి యుగానికి తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు.

హర్మూజ్​తో పనిలేదు

ఇంధన రవాణాలో కీలకమైన హర్మూజ్​ జలసంధి గురించి ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ జలసంధిపై యూఎస్​ ఆధారపడడం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా దాని అవసరం తమకు ఉండదని వెల్లడించారు. అయితే దీనిపై ఆధారపడ్డ దేశాలే ధైర్యాన్ని కూడగట్టుకుని జలసంధిని చూసుకోవాలని వ్యాఖ్యానించారు. తమ మిత్రదేశాలకు ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

President Trump delivered a primetime address to the nation on Wednesday, touting U.S. military operations against Iran. https://t.co/o7rjXBf2o5 pic.twitter.com/SctsUZXwHn

— ABC News (@ABC) April 2, 2026

ఇది కూడా చదవండి..: NATO Alliance | నాటో ‘కాగితపు పులి’.. దాని నుంచి వైదొలుగుతాం..: ట్రంప్​

Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!
Eye wear | కళ్లద్దాలు వాడుతున్నారా.. ఈ చిన్న తప్పులు చేస్తే కంటి చూపుకే ప్రమాదం!
Pakistan Stock Market Crash | కుప్పకూలిన పాకిస్తాన్‌ స్టాక్‌ మార్కెట్‌.. 45 నిమిషాలు నిలిచిపోయిన ‍ట్రేడింగ్‌
India Energy Security | భారత ఇంధన భద్రత, నౌకల రక్షణపై దృష్టి సారించిన కేంద్రం..
Daily Horoscope March 1 | ఈ రాశుల వారికి పరుచుకున్న ఎర్ర తివాచీ.. ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టడమే తరువాయి!
TAGGED:Donald Trump speechglobal war updatesIran military newsIran tensions 2026Middle East conflictTrump Iran WarningUS airstrikes IranUS Iran conflict
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Multiple Bank Accounts Multiple Bank Accounts | ఒకే బ్యాంకులో రెండు, మూడు అకౌంట్లు ఉండొచ్చా.. ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా.. నష్టమా?
Next Article Agra Double Murder Verdict Agra Double Murder Verdict | ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?