అక్షరటుడే, వెబ్‌డెస్క్ : US Iran Talks | పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో (Islamabad) జరిగిన అమెరికా–ఇరాన్ కీలక చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. సుమారు 21 గంటల పాటు కొనసాగిన ఈ చర్చలు విఫలమవడంతో ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్‌ఐబీ ప్రకారం, చర్చలు విఫలమవడానికి అమెరికా పెట్టిన కఠినమైన, అన్యాయమైన షరతులే కారణమని ఇరాన్ పేర్కొంది. తమ దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ఇరాన్ బృందం నిరంతరంగా చర్చలు జరిపిందని, అనేక ప్రతిపాదనలు ఇచ్చినా అమెరికా మొండిగా వ్యవహరించడంతో పురోగతి సాధ్యపడలేదని వెల్లడించింది.
US Iran Talks | అమెరికా వాదన
అమెరికా బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, తాము ఇచ్చిన ఆఖరి, ఉత్తమ ఆఫర్‌ను ఇరాన్ తిరస్కరించిందన్నారు. ముఖ్యంగా అణు ఆయుధాల తయారీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని అమెరికా కోరిందని తెలిపారు. ఇరాన్ నిబంధనలను అంగీకరించకపోవడం ఆ దేశానికే నష్టమని వాన్స్ వ్యాఖ్యానించారు. చర్చల సమయంలో తాను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో (Donald Trump) పలుమార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. 1979 విప్లవం తర్వాత ఈ స్థాయిలో అమెరికా–ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చలపై ఆసక్తి నెలకొంది.
US Iran Talks | వాన్స్ హెచ్చరికలు
గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ (Israel) దళాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు కీలక నేతలు మరణించినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ పరస్పర దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు ట్రంప్ రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించడంతో శాంతి చర్చలకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఆర్థిక, సైనిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్ Iran , అమెరికా షరతులకు తలొగ్గకపోవడం ఆ దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని వాన్స్ హెచ్చరించారు. మరోవైపు ఈ చర్చలు విఫలం కావడంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వానికి అమెరికా ఉపాధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా పాక్ ప్రధానమంత్రి, సైన్యాధిపతి తీసుకున్న చొరవను ప్రశంసించారు.
దీనిని కూడా చదవండి : Iran Peace Talks | శాంతి చర్చలకు ఇరాన్ ప్రతినిధులు.. రక్తంతో తడిసిన స్కూల్ బ్యాగులు, బూట్లతో పాకిస్తాన్‌కి..!
