అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Iran Tensions | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. Strait of Hormuz జలసంధిని ఇరాన్ వెంటనే తెరవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
US Iran Tensions | శాంతి చర్చల విఫలంతో..
ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో, తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ అణు ఆయుధాలు పొందకుండా అడ్డుకుంటామని పేర్కొన్న ట్రంప్, అవసరమైతే తుది యుద్ధానికైనా సిద్ధమని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధి విషయంలో యూఎస్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం గ్లోబల్ మార్కెట్లలో ఆందోళనలకు దారితీస్తోంది.
ఘాటుగా స్పందన..
అమెరికా హెచ్చరికలకు Iran కూడా తీవ్రంగా స్పందించింది. తమ భూభాగంపై ఎలాంటి జోక్యం చేసుకున్నా సహించబోమని స్పష్టం చేసింది. శత్రువులు చిన్న పొరపాటు చేసినా వారు ప్రాణాంతక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
