Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: US Israel Iran Conflict | అమెరికా – ఇజ్రాయెల్​ దాడులు.. నాలుగో రోజూ కొనసాగుతున్న ఉద్రిక్తత!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - US Israel Iran Conflict | అమెరికా – ఇజ్రాయెల్​ దాడులు.. నాలుగో రోజూ కొనసాగుతున్న ఉద్రిక్తత!

తాజా వార్తలు

US Israel Iran Conflict | అమెరికా – ఇజ్రాయెల్​ దాడులు.. నాలుగో రోజూ కొనసాగుతున్న ఉద్రిక్తత!

ఇరాన్​పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు చేపట్టిన నాలుగో రోజు ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హోర్ముజ్ జలసంధి మూసివేత, గల్ఫ్ దేశాల్లో సైనిక చర్యలు, పెరుగుతున్న మృతుల సంఖ్య మధ్య పశ్చిమాసియా భద్రతా పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది.

Naresh chandan
Last updated: మార్చి 3, 2026 9:53 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
US Israel Iran Conflict
US Israel Iran Conflict

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US Israel Iran Conflict | అమెరికా–ఇజ్రాయెల్ దాడులు జరిగిన నాలుగో రోజు కూడా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా కొనసాగుతున్నాయి. United States – Israel సంయుక్తంగా చేపట్టిన దాడులకు ప్రతిగా Iran తీవ్ర స్థాయిలో ప్రతిదాడులు కొనసాగిస్తోంది. కీలక ఇరాన్ సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రాంతీయ భద్రతపై మరింత ఆందోళన నెలకొంది.

Contents
  • US Israel Iran Conflict | దెబ్బతిన్న చారిత్రాత్మక కట్టడాలు..
    • US Israel Iran Conflict | గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత
      • US Israel Iran Conflict | ఇజ్రాయెల్‌లో రక్షణ చర్యలు

US Israel Iran Conflict | దెబ్బతిన్న చారిత్రాత్మక కట్టడాలు..

టెహ్రాన్‌లోని పలు ప్రభుత్వ, చారిత్రక కట్టడాలు దాడులకు గురయ్యాయి. ప్రభుత్వ ప్రసార సంస్థ Islamic Republic of Iran Broadcasting (IRIB) కార్యాలయం తీవ్రంగానే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు యునెస్కో వారసత్వ జాబితాలో గుర్తింపు పొందిన Golestan Palace దెబ్బతిన్నట్లు సమాచారం.

ఇరాన్ స్థానిక మీడియా కథనం ప్రకారం.. అమెరికా – ఇజ్రాయెల్​ దాడి వల్ల ఇరాన్​లో ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei సహా మరణించిన వారి సంఖ్య 787 కు చేరుకుంది. దక్షిణ ఇరాన్‌లో ఒక బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో సుమారు 165 మంది మరణించినట్లు స్థానిక మీడియా కథనం.

అమెరికా లక్ష్యాలు నెరవేరేవరకు చర్యలు కొనసాగుతాయని అధ్యక్షుడు Donald Trump స్పష్టం చేశారు. “ఇంకా తీవ్రమైన కఠిన దాడులు ముందున్నాయి” అని అమెరికా విదేశాంగ మంత్రి Marco Rubio హెచ్చరించారు. రక్షణ మంత్రి Pete Hegseth ఈ దాడులు ఇరాన్ నౌకాదళాన్ని బలహీనపర్చడం, అణు–క్షిపణి సామర్థ్యాన్ని అరికట్టడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

US Israel Iran Conflict | గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత

Qatarలో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కానీ, రెండు క్షిపణులు అల్ ఉడైద్ ఎయిర్ బేస్‌ను తాకినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిదారుగా పేరు పొందిన QatarEnergy తాత్కాలికంగా తన ఉత్పత్తిని నిలిపివేసింది.

Kuwaitలో మూడు యూఎస్​ యుద్ధవిమానాలు కూలిపోయాయి. Saudi Arabia రాజధాని రియాద్ సమీపంలో డ్రోన్లను అడ్డుకున్నట్లు స్థానిక సర్కారు వెల్లడించింది. అమెరికా దౌత్య కార్యాలయాలపైనా దాడులు జరిగాయి.

United Arab Emiratesలోని Dubai International Airport నుంచి పరిమిత సంఖ్యలో విమానాలు తిరిగి ప్రారంభమైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. మధ్య ప్రాచ్యంలో ప్రాంతీయ హింస పెరుగుతున్నందున అమెరికా పౌరులు గల్ఫ్ దేశాలను విడిచి స్వదేశానికి చేరుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

US Israel Iran Conflict | ఇజ్రాయెల్‌లో రక్షణ చర్యలు

ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులను Israel వైమానిక రక్షణ వ్యవస్థలు గట్టిగానే అడ్డుకుంటున్నాయి. లెబనాన్ వైపు నుంచి వచ్చిన 2 డ్రోన్లను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.

ఇరాన్ అణు కేంద్రాలపై దాడులను సమర్థిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahu..  “ఇది త్వరిత, నిర్ణయాత్మక చర్య”గా వర్ణించారు.

Global Stock Markets | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు..
Stock Market Surge | తగ్గుతున్న ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన సూచీలు
White Hair Myth | తెల్ల జుట్టును పీకేస్తే ఎక్కువ అవుతాయా.. అసలు నిజం ఇదే!
March 17 Horoscope | వ్యాపార భాగస్వామ్యాలకు అనుకూలమైన రోజు.. ఈ రాశుల వారికి లాభాల వర్షం ఖాయం!
Sadabainama Application | మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం..
TAGGED:Global Oil Supply CrisisGulf tensions 2026Iran missile attacksIsrael Iran warMiddle East CrisisStrait of Hormuz ClosureTehran AttacksUS Military Strikes
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kamareddy Chairperson Election Kamareddy Chairperson Election | కామారెడ్డి ఛైర్​పర్సన్​ ఎన్నిక చెల్లదు.. కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్​ కౌన్సిలర్​ అభ్యర్థి
Next Article Face Recognition Schemes Face Recognition Schemes | ఇకపై అన్ని పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే.. రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?