Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: US Tornado Outbreak | అమెరికాలో టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - US Tornado Outbreak | అమెరికాలో టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి

అంతర్జాతీయం

US Tornado Outbreak | అమెరికాలో టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి

అమెరికాలోని మిచిగాన్, ఒక్లహోమాలను టోర్నడో బీభత్సం సృష్టించింది. ఆరుగురు మృతి చెందగా...12 మందికిపైగా గాయపడ్డారు.

Srinivas kolluri
Last updated: మార్చి 8, 2026 1:24 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
US Tornado Outbreak

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Tornado Outbreak | అమెరికా (America) లోని మిచిగాన్ (Michigan), ఒక్లహోమాలను టోర్నడో బీభత్సం సృష్టించింది. 241 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచాయి. దీంతో వందలాది చెట్లు నెలకొరిగాయి. ఇళ్లు కూలిపోయాయి. టోర్నడో ధాటికి ఆరుగురు మరణించగా, 12 మందికిపైగా గాయపడ్డారు.

దక్షిణ మిచిగాన్‌లో 12 ఏళ్ల బాలుడితో సహా నలుగురు మరణించారని, ఒక్లహోమాలో ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది నష్టాన్ని అంచనా వేస్తున్నారు. టోర్నడో కారణంగా చెట్లు, విద్యుత్ లైన్లు కూలిపోయాయి. భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.

US Tornado Outbreak | నిలిచిన విద్యుత్​ సరఫరా

గ్రేట్ ప్లెయిన్స్ నుంచి టెక్సాస్ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మిచిగాన్‌లో సుడిగాలి ప్రభావతంతో యూనియన్ సిటీ సమీపంలో ముగ్గురు మరణించారని, 12 మంది గాయపడ్డారని బ్రాంచ్ కౌంటీ షెరీఫ్ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో విద్యుత్తు అంతరాయం, రోడ్డు మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. విద్యుత్​ స్తంభాలు నేలకూలడంతో వందలాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్ బ్రాంచ్, కాస్ సెయింట్ జోసెఫ్ కౌంటీలకు రాష్ట్ర అత్యవసర పరిస్థితిని ప్రారంభించినట్లు చెప్పారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి, ప్రభావితమైన వారికి చేయూత అందించడానికి అత్యవసర బృందాలతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై పడ్డ చెట్లను తొలగిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Israel Iran Attacks | ఇరాన్​ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు

Iran Underground Weapons | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇరాన్ భూగర్భంలోని ఆయుధాల వీడియో విడుదల..
Qatar Iran Missile | ఖతార్​పై ఇరాన్​ క్షిపణి దాడి.. భయంతో ప్రజల పరుగులు
Pakistan Afghanistan Border Clash : 400 మందికి పైగా తాలిబాన్ సైనికులు మరణించారు.. 46 ప్రదేశాలు దెబ్బతిన్నాయి: పాక్ మంత్రి
Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్
Iran US Conflict | ఇరాన్‌పై యూఎస్ దాడులు.. ఆందోళనలో భారత్.. ఎందుకంటే?
TAGGED:michigan emergency newsmichigan tornado newsoklahoma storm damagesevere weather united statestornado disaster usaus tornado outbreak
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Revanth Reddy EV Plan Revanth Reddy EV Plan | డీజిల్​ బస్సులను తొలగిస్తాం.. త్వరలో విద్యార్థినులకు స్కూటీలు : సీఎం రేవంత్​రెడ్డి
Next Article HPV Vaccine Girls | HPV Vaccine Girls | హెచ్​పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?